RajakeeyaaluRajakeeyaalu

Saturday, March 24, 2018

నీర‌వ్ కు ప‌చ్చ లింకులు..!!?

  • March 8, 2018 | UPDATED 14:25 IST Views: 21734
  • Share

 

నీవ‌ర్ మోదీ. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం గా మారిన వ్య‌క్తి. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు ను వేలాది కోట్ల‌కు ముంచిన ఘ‌నుడు. అటు వంటి వ్య‌క్తికి హైద‌రాబాద్‌లోనూ వ్యాపార సామ్రాజ్యం ఉంది. ఆ వ్యాపారంలో తెలుగు ప్ర‌ముఖులు ఉన్న‌ట్లు ప్రాధ‌మికంగా గుర్తించా రు. తొలి నుండి TDP అధినేత‌కు స‌న్నిహిత వ్య‌క్తిగా పేరున్న ఓ వ్య‌క్తి పేరు ప్ర‌స్తుతం ప్ర‌చారం లోకి వ‌చ్చింది. కేంద్రం నుండి TDP మంత్రుల‌ను ఉప సంహ‌రించుకుంటున్న స‌మ‌యంలో..ఇదే అంశం పై ప్ర‌ఖ్యాత అన‌లిస్టు త‌న ట్విట్ట‌ర్‌లో ఒక కొత్త అనుమానాన్ని పోస్ట్ చేసారు. నీర‌వ్ మోదీ కుంభ‌కోణంలో త‌న మ‌నుషుల‌ను ర‌క్షించుకోవ‌టం కోసం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించార‌ని ఆరోపించారు. ఇందుకోస‌మే అంబానీ లాంటి వారి తో రాయ‌బారాలు జ‌రిగాయ‌ని ప్ర‌చారం జోరుగా సాగుతోంది. చంద్ర‌బాబు సైతం కేంద్రం కేసులు పెట్ట‌వ‌చ్చ‌ని..ఇబ్బందులు సృష్టించ‌వ‌చ్చ‌ని..స‌మ‌స్య‌లు ఉంటాయ‌ని చెబుతున్న నేప‌థ్యంలో ఈ ఆరోప‌ణ‌లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇంత‌కీ అస‌లు వ‌స్తున్న ఆరోప‌ణ‌లు ఏంటి….

పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకులో వేలాది కోట్ల రుణం తీసుకొని ముంచేసిన వ‌జ్రాల వ్యాపారి నీర‌వ్ మోదీ నీడ‌లు హైద‌రాబాద్‌లో క‌ని పిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా స‌మీపంలో జెమ్స్ సెజ్ పార్క్ ను ఏర్పాటు చేసారు. తొలుత రాజీవ్ జెమ్స్ పార్క్‌గా దీనిని ఏర్పాటు చేసారు. 200 ఎక‌రాల్లో ఏర్పాటు చేసిన ఈ సెజ్ లో హైద‌రాబాద్ జెమ్స్ ను సంస్థ ఎండి చుక్క‌ప‌ల్లి సురేష్ ప్రారంభించారు. 2014 త‌రువాత ఈ సెజ్ గీతాంజ‌లి జెమ్ పార్క్ గా మారింది. నీవ‌ర్ మోదీ ఉదంతం బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత పంజాబ్ నేష‌న‌ల్ బ్యాం కు అధికారులు..ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల‌తో క‌లిసి ఇక్క‌డ దాడులు నిర్వ‌హించారు. ఈ సెజ్ కింద చూపించిన లెక్క‌ల్లో 3500 కోట్లు గోల్‌మాల్ ఉన్న‌ట్లు అధికారులు ప్రాధ‌మికంగా గుర్తించారు.
అయితే, ఇప్పుడు జెమ్స్ పార్క్ ఏర్పాటులో తొలుత కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన చుక్క‌ప‌ల్లి సురేష్ పేరు ఇప్పుడు తెర మీద‌కు వ‌చ్చింది. ఇదే చుక్క‌ప‌ల్లి సురేష్ కు 2002లో చంద్ర‌బాబు APSTC ద్వారా హైద‌రాబాద్ లో 2.6 ఎక‌రాలు కేటాయించింది. చుక్క‌ప‌ల్లి సురేష్ కు చంద్ర‌బాబు కు ఉన్న అనుబంధాన్ని వైసిపి గౌర‌వాధ్య క్షురాలు వైయ‌స్ విజ‌య‌మ్మ 2011 లో చంద్ర‌బాబు పై దాఖ‌లు చేసిన కేసులోనూ ప్ర‌స్తావించారు. చుక్క‌ప‌ల్లి సురేష్ సోద‌రుడు TDP నుండి ఎన్నిక‌ల బ‌రిలో నిల‌బ‌డిన అంశాన్ని విజ‌య‌మ్మ త‌న పిటీష‌న్‌లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా, ప్ర‌ముఖ డేటా అన‌లిస్టు, డిజిట‌ల్ స్ట్రాట‌జిస్ట్ డాక్ట‌ర్ గౌర‌వ్ ప్ర‌ధాన్ చేసిన ట్వీట్ ఈ వ్య‌వ‌హారం మొత్తం పై అనేక అనుమానాల‌కు కార‌ణంగా నిలుస్తోంది.
కేంద్ర ప్ర‌భుత్వం నుండి TDP త‌న ఇద్ద‌రు ఉప‌సంహ‌రించుకున్న‌ట్లు చంద్ర‌బాబు ప్ర‌క‌టిస్తున్న స‌మ‌యంలోనే..గౌర‌వ్ ప్ర‌ధాన్ ఒక ట్వీట్ చేసారు. జాతీయ‌-అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాల్లో ఆయ‌న చెప్పిన అంశాలు..ఇచ్చిన విశ్లేష‌ణ‌లు వాస్త‌వ రూపం దాల్చ‌టం తో ఇప్పుడు ఆయ‌న చేసిన తాజా ట్వీట్ క‌ల‌క‌లం రేపుతోంది. గౌర‌వ్ ప్ర‌ధాన్ త‌న ట్వీట్‌లో చంద్ర‌బాబు ను ఉద్దేశించి నీవ‌ర్ మోదీ.. చోక్సీ తో మీకు ఉన్న లింకులు ఏంట‌ని ప్ర‌శ్నించారు. దీనికి కొన‌సాగింపు గా త‌న‌కున్న స‌మాచారం మేర‌కు నీర‌వ్ మోదీ స్కాం పై మీరు సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు మా వ‌ద్ద స‌మాచారం ఉంద‌ని..ఇది నిజమా..కాదా అని ట్వీట్ ద్వారా ప్ర‌శ్నించారు. దీంతో నీర‌వ్ మోదీ వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబు కు నిజంగా ఏమైనా లింకులు ఉన్నాయా అనే చ‌ర్చ మొద‌లైంది.
కొద్ది రోజుల క్రితం రిల‌య‌న్స్ అధినేత అంబానీ సైతం అమ‌రావ‌తి వ‌చ్చి ఏపి ముఖ్య‌మంత్రి తో ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యారు. రాత్రి చంద్ర‌బాబు నివాసంలోనే విందు చేసి..రాత్రి 11 గంట‌ల వ‌ర‌కు అక్క‌డే ఉన్నారు. ఇదంతా ఇదే వ్య‌వ‌హారం పై సంప్ర‌దింపులు జ‌రిగాయ‌నే ఆరోప‌ణ‌లు గుప్పు మంటున్నాయి. ఇది నిజ‌మా కాదా అంటూ గౌర‌వ్ ప్ర‌ధాన్ ప్ర‌శ్నించ‌టంతో..దీని వెనుక నిజం ఉందా..ఉంటే ఎంత వ‌ర‌కు అనే చ‌ర్చ మొద‌లైంది. అయితే, ఇదే నిజ‌మైతే..ప్ర‌స్తుతం కేంద్ర ప్ర‌భుత్వం నుండి బ‌య‌ట‌కు వ‌చ్చినా..ఎన్డీఏ లో కొన సాగుతున్న TDP అధినాయ‌క‌త్వం ఏ ర‌కంగా మేనేజ్ చేసుకుంటుంద‌నేది పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో హాట్ టాపిక్‌. మ‌రి.. గౌర‌వ్ ప్ర‌ధాన్ వ్య‌క్తం చేసిన అనుమానాల్లో నిజా నిజాలు ఎంత‌నే విష‌యం పైనా చ‌ర్చ సాగుతోంది. దీంతో..రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంద‌నేది ఆస‌క్తి క‌రంగా మారుతోంది.