RajakeeyaaluRajakeeyaalu

Wednesday, January 24, 2018

Open Challenge to TDP Govt on Gandikota Project

  • January 11, 2017 | UPDATED 19:47 IST Views: 415
  • Share

 

నీ ప్రేమలో తడిసి ముద్దవ్వాలి బాబూ..ముద్దవ్వాలి!

అబ్బబ్బా..ఈ అంజలీదేవులతో చచ్చేంత చావు బాబు….ఎవరో అనుకునేరు!పాతతరం అమ్మలు.వీళ్లకెప్పుడూ వీళ్ల పిల్లలు ఏ కలెక్టరో కావాల్సిందే!ఏ సత్య నాదెళ్ల,సుందర్ పిచాయ్ లు అన్నా కూడా వీళ్ల కంటికి ఆనరు.కలెక్టర్ కలెక్టరే…అదృష్టం ఆ శ్రీలక్ష్మి మా వీధి అమ్మాయి కాదు..లేకుంటేనా మా అంజలీదేవి..చూసావా,అమ్మాయై ఉండీ first attempt లో కలెక్టర్ అయిందని ఎంత దెప్పి పొడిచేదో!ఇంకా నయం ఎట్లో ఆ తమిళనాడు chief secratry కళ్ల పడలేదు…thank god.
అసలు కలెక్టర్లంటే ఆ దర్జా,దర్పం,నౌకర్లు,చాకర్లు,బిళ్ల బంట్రోతు….అబ్బాబ్బో..ఎంతాబాగా వాళ్లతో తల్లిదండ్రుల సేవ చేయిస్తారో!!!!ఇదీ వాళ్ల ఆశేమో!!!
సరే ఈ గోల పక్కన పెట్టేస్తున్నా..
కర్నూలు-కడప హైవే మీద పాణ్యం దగ్గర రోడ్డు పక్కనే సుగాలి మెట్ట అనే గ్రామం ఉంది…లంబాడీ/బంజారాలను సుగాలీలు అంటాము.
ఇక్కడి నుంచి ఒకాయన IPS officer అయ్యాడు..పేరు D.T.Nayak.ఆ తర్వాత వాళ్ల తల్లిదండ్రుల కోసం ఒక ఇల్లు కట్టించాడు.ప్రస్తుతం ఈ దారిని 4 లేన్లగా మార్స్తున్నందున కూలగొట్టబోతున్నారు…
ఆ ఇంటివెనకాల ఉన్న రాళ్ల గుట్టలు మరేవో కావు మన రాజగురువు తవ్వించిన,20,000 క్యూసెక్కుల నీళ్లు తీసుకుపోయే గాలేరు-నగరి కాలువవి.

gandi1gandi2
ఈ రోజు మన ప్రియమైన బాబుగోరు పులివెందులకు ఈ కాలువ ద్వారా గండికోట చేరిన నీళ్లను ఎత్తిపోయబోతున్నారు.ఇంకేం ఆ ప్రాంతమంతా సుభిక్షం కాబోతుంది.
ఆ నాయక్ గారి పాడు కాలం లో తెలుగు మీడియంలో చదవాల్సి వచ్చేది…
ఇప్పుడు చూడండి..నా సామిరంగా..సుభిక్షమైఅన పులివెందుల వాసులు లక్షల ఫీజులు కట్టేసి ఎంచక్కా మన నారాయణ IAS foundation course లో ఒకటో తరగతి నుంచే చేరిపోతారు…
ఎంత గొప్పోడివి బాబు….నీ ప్రేమ లో ఇలాగే ఉండి తడిసి ముద్దవ్వాలి బాబు..ముద్దవ్వలి.
మా కొత్తతరం అంజలీదేవుల కోర్కెలు తీర్చబోతున్న నీకు హార్ధిక శుభాకాంక్షలు.

ఈ క్రింద ఇవ్వబోతున్న ఫొటో లను ఒక్క సారి గమనించండి… ఇవాళ బాబు గారు భావొద్వేగం తో జాతి కి అంకితం చేసిన గండికోట ప్రోజెక్టు కి సంబంధించిన కాలువలు అవి… ఆ కలువల పనులు పూర్తి అయ్యాయో లెదో మీరే గమనించండి… ఇలాంటి కాలువల్లో నీటిని పారించి 20,000  క్యూసెక్కుల నీరు ప్రవహింపచేయగలరా???

తెలుగుదేశం ప్రభుత్వానికి ఇదే మా బహిరంగ సవాల్….

gandi4gandi5gandi6gandi7gandi8gandi9gandi10gandi11gandi12gandi13

ఆ గాలేరు-నగరి కాలువ  ఉన్నది కర్నూల్-కడప రోడ్ పక్కన అంటే గోరుకల్లు రిజర్వాయర్ కు 5,6కి.మీ దూరం.ఇదే కాదు ఆ కాలువ బనగానపల్లె దగ్గర ఈ కింది ఫోటో….ఎవరైనా పందేనికి సిద్దమైతే ఖర్చులు నావే…ఈ ఫోటోలు తప్పయితే తెదేపా ఆఫీస్ లో జీవితాంతం చప్రాసీ పని చేస్తా…లేదంటే పచ్చగొర్రెలు ఆ పార్టీని ఛీకొడతారా?

newgandinewgandi1

By— Gopireddy Srinivasa Reddy gaaru.