RajakeeyaaluRajakeeyaalu

Monday, December 11, 2017

ఎవ‌రిది పై చేయి….!

  • October 12, 2017 | UPDATED 17:45 IST Views: 4384
  • Share

 

పాద‌యాత్ర స‌మ‌యంలో YCP రెండంచ‌ల వ్యూహం. AP ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టేలా కొత్త కార్య‌క్ర‌మాలు. జ‌గ‌న్ పాద‌యాత్ర కు  ఇమేజ్ పెర‌గ‌కుండా TDP ప్ర‌తి వ్యూహాలు. పాద‌యాత్ర ప్రారంభం కాగానే అసెంబ్లీ స‌మావేశాలు. YCP MLA ల‌ను స‌మావేశాల పేరుతో క‌ట్ట‌డి. జ‌గ‌న్ లేకపోతే YCP కి స‌భ‌లో బ‌లం లేదంటున్న TDP. పాద‌యాత్ర కు కౌంటర్‌గా ముఖ్య‌మంత్రి -మంత్రుల జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు..స‌భ‌లు. ఇందు కోసం కొత్త కార్య‌క్ర‌మానికి రూప‌క‌ల్ప‌న‌. ప‌వ‌న్ కార్యాచ‌ర‌ణ పైనా TDP దృష్టి. ఇలా..న‌వంబ‌ర్ మాసం నుండే APలో అధికార – ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య వ్యూహ – ప్ర‌తి వ్యూహాల‌తో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం ప్రారంభం కానుంది. మ‌రి..సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందే రెండు ప‌క్షాలు ప్ర‌జా క్షేత్రంలో తల ప‌డుతున్నాయి. దీంతో..ఎవ‌రిది పై చేయి అవుతుంద‌నే చ‌ర్చ ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది…
 
న‌వంబ‌ర్ రెండు జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభం. ఇడుపుల‌పాయ నుండి ప్రారంభం కానుండటంతో..సొంత జిల్లాలో జ‌గ‌న్ కు స్థానికులు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌ట్టటం ఖాయం. ఇక‌, అదే స‌మ‌యంలో..జ‌గ‌న్ పాద‌యాత్ర జ‌రిగే జిల్లా మిన‌హా మిగిలిన 12 జిల్లాల్లో స్థానిక స‌మ‌స్య‌ల మీదా..ప్ర‌త్యేక హోదా అంశం పైనా ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయి ప్ర‌భుత్వం పై ఒత్తిడి పెంచే కార్య‌క్రమాల‌కు సిద్దం కావాల‌ని YCP అధినేత ఇప్ప‌టికే పిలుపు నిచ్చారు. వ‌చ్చే ఏడాదే ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉండ‌టంతో MLAలు..నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జ్‌లు బూత్ లెవ‌ల్ క‌మిటీల‌ను బ‌లోపేతం చేసుకోవాల‌ని సూచించారు. ఇక‌, “YSR కుటుంబం”లో చేరే వారి సంఖ్య కోటి కుటుంబాల టార్గెట్ గా నిర్ణ‌యించిన YCP..న‌వంబ‌ర్ ఒక‌టో తేదీ వ‌ర‌కు ఈ కార్య‌క్రమం కొన‌సాగించే అవ‌కాశం ఉంది. పాద‌యాత్ర ద్వారా స‌హ‌జంగానే ప్ర‌భుత్వం పై ఒత్తిడి పెరుగుతుంది. ప్ర‌తిప‌క్ష నేత ప్రజా వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల పై ధ్వ‌జ‌మెత్తుతూ.. క్షేత్ర స్థాయిలో ప్ర‌జా స‌మ‌స్య‌ల పై దృష్టి పెట్ట‌టం ద్వారా ప్ర‌భుత్వం మీద రాజ‌కీయంగా పై చేయి సాధించ‌టం ఖాయం. అయితే, జ‌గ‌న్ కు స‌హ‌జంగానే ఉండే ప్ర‌జాభిమానం తో పాద‌యాత్ర లో జ‌న ప్ర‌వాహం ఎక్కువ‌గా ఉంటుంద‌ని TDP నేత‌లే అంచ‌నా వేస్తున్నారు. పాద‌యాత్ర – జిల్లాల వారీగా స‌మ‌స్య‌ల పై మిగిలిన జిల్లాల్లో ప్ర‌జా మ‌ద్ద‌తు కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌టం ద్వారా ఇక‌, ఆరు నెల‌ల పాటు ప్ర‌జ‌ల దృష్టి అంతా YCP మీదే ఉండ‌టం తో పాటు..ప్ర‌భుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేయ‌టం YCP ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది.
 
YCP వ్యూహం ఇలా ఉంటే..YCP నిర్ణ‌యాల కోసం ఎదురు చూస్తున్న TDP అధినాయ‌కత్వం ప్ర‌తి వ్యూహాల అమ‌లు కోసం సిద్దం అవుతోంది. ఉద్దేశ పూర్వ‌కంగానే వ‌ర్షాకాల స‌మావేశాల నిర్వ‌హ‌ణ పై నిర్ణ‌యం తీసుకోకుండా..ప్ర‌భుత్వం జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభ‌మైన వెంట‌నే స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. న‌వంబ‌ర్ 8 నుండి అసెంబ్లీ వర్షాకాల స‌మావేశాలు మొదలు పెట్టే యోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఇక‌, ఈ స‌మావేశాల‌ను వారం నుండి ప‌ది రోజుల పాటు నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. దీని ద్వారా జ‌గ‌న్ లేకుండా స‌మావేశాల‌ను నిర్వ‌హించటం ద్వారా ఏక‌ప‌క్షంగా త‌మ నిర్ణ‌యాలను అమ‌లు చేయ‌వ‌చ్చ‌ని..అదే స‌మ‌యంలో YCP MLAల‌ను జ‌గ‌న్ తో పాటు లేకుండా స‌మావేశాల పేరుతో క‌ట్ట‌డి చేయ‌వ‌చ్చ‌నేది ప్ర‌భుత్వ ఆలోచ‌న‌గా క‌నిపిస్తోంది. ఇదే స‌మ‌యంలో.. జ‌గ‌న్ పాద‌యాత్ర కు మైలేజ్ ను సాధ్య‌మైనంత త‌క్కువ చేయాల‌నే వ్యూహాల‌ను ప్ర‌భుత్వంలోని అధినేత కోట‌రీ ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తోంది. జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తున్న స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాన్ కార్యాచ‌ర‌ణ ఎలా ఉంటుందో చూడాల‌ని..అది చూసిన త‌రువాత‌..ప‌వ‌న్ యాత్ర మొద‌లు పెడితే..దానికి ప్ర‌చారం వ‌చ్చేలా చేయ‌టం..ప‌వ‌న్ యాత్ర ప్రారంభించ‌క పోతే..ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు ప్ర‌భుత్వం పేరుతో కొత్త కార్య‌క్ర‌మం ప్రారంభించాల‌ని TDP నేత‌లు యోచిస్తున్నారు. ముఖ్య‌మంత్రి ..మొద‌లు మంత్రులు-MLAలు ప్ర‌తీ ప్రాంతంలో ప‌ర్య‌టించాల‌నేది వారి వ్యూహం. దీని ద్వారా..జ‌గ‌న్ వైపు ఎక్కువ ప్ర‌జ‌ల దృష్టి మ‌ళ్ల‌కుండా..డైవ‌ర్ట్ చేయ‌వ‌చ్చ‌నేది వారి వ్యూహం.