RajakeeyaaluRajakeeyaalu

Monday, December 11, 2017

అడ్డుకొనే ప్ర‌య‌త్నాలు చేస్తారు…!

  • October 11, 2017 | UPDATED 18:54 IST Views: 4359
  • Share

 

పాద‌యాత్ర ను అడ్డుకొనేంద‌కు కుట్ర‌లు చేస్తారు. అధికార పార్టీ కుయుక్తులు చేస్తుంది. ఎన్ని అవాంత‌రాలు వ‌చ్చినా పాదయాత్ర ఆగ‌దు. స‌మిష్టిగా..స‌మ‌న్వ‌యంతో పార్టీ నేత‌లంతా ముందుకు క‌ద‌లండి అంటూ పిలుపునిచ్చారు YCP అధినేత జ‌గ‌న్‌. ముంద‌స్తు ఎన్నిక‌లు త‌ప్పేలా లేవు. ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా ఎదుర్కొవాల్సిందే. వ‌చ్చే అక్టోబ‌ర్ నాటికే ఎన్నికల షెడ్యూల్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. స‌మ‌రానికి సిద్దం కండి…అంటూ పార్టీ నేత‌ల‌కు జ‌గ‌న్ స్ప‌ష్ట‌మైన మార్గ నిర్ధేశ‌కం చేసారు. ఏం జ‌రిగినా పార్టీ గెలుపే ల‌క్ష్యంగా ప్ర‌తీ ఒక్క‌రూ ప‌ని చేయాల్సిందేన‌ని..పార్టీకి మేలు జ‌రిగే ఏ నిర్ణ‌యాన్ని అయినా నిర్బయంగా తీసుకోండంటూ ఉత్తేజాన్ని నింపారు. ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలో బూత్ క‌మిటీల పై మాత్రం ప్ర‌త్యేక దృష్టి పెట్టాల‌ని..అధికార పార్టీ కుట్ర‌ల‌ను ముమ్మ‌రం చేస్తుంద‌ని, ఎదుర్కోవ‌టానికి సిద్దం కావాల‌ని YCP అధినేత పిలుపునిచ్చారు…ఏది ఏమైనా మ‌న గోల్ మాత్రం స‌క్సెస్ కావాల్సిందేనంటూ స్ప‌ష్టం చేసారు…

పార్టీ నేత‌ల‌తో స‌మావేశ‌మైన జ‌గ‌న్ ముంద‌స్తు ఎన్నిక‌ల పై స్ప‌ష్ట‌మైన సంకేతాలిచ్చారు. 2018 అక్టోబ‌ర్ నాటికే ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంద‌ని చెప్పుకొచ్చారు. ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలో అక్టోబ‌ర్ లోనే ఎన్నిక‌ల‌నే విధంగా ప్ర‌తీ ఒక్క‌రూ సిద్దం కావాల‌ని నిర్ధేశించారు. జాతీయ స్థాయిలో ఒక‌టే సారి ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌నే దాని పై చ‌ర్చ జ‌రుగుతుంద‌ని..పార్టీ నేత‌లంతా కేడ‌ర్ ను ఆ దిశ‌గా సంసిద్దుల‌ను చేయాల‌ని సూచించారు. ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలో బూత్ లెవ‌ల్ క‌మిటీల పై సీరియ‌స్ గా దృష్టి సారించాల‌ని ఆదేశించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో బూత్ లెవ‌ల్ క‌మిటీలే కీల‌క‌మ‌ని..ప్ర‌తీ ఇన్ ఛార్జ్ త‌మ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ప్ర‌తీ బూత్ కు సంబంధించి క‌మిటీల ప‌ని తీరు పై ప‌ర్య‌వేక్ష‌ణ ఉంచాల‌ని..గ‌తం లాగా కాకుండా..క‌మిటీల్లో అక్క‌డి ప‌రిస్థితుల‌కు అనుగుణంగా అవ‌కాశాలు క‌ల్పించాల‌ని సూచించారు. త‌న పాద‌యాత్ర స‌మయంలో..నియోజ‌క‌వ‌ర్గంలో ఆ రోజు ప‌రిస్థితులు..స్పంద‌న కు అనుగుణంగా స‌భ‌లు – స‌మావేశాలు ఏర్పాటు చేయాల్సి వ‌స్తే..ఆ దిశ‌గా త‌క్ష‌ణ ఏర్పాట్ల పై దృష్టి సారించాల‌ని సూచించారు. ప్ర‌ధానంగా ప్ర‌తీ ఇన్‌ఛార్జ్.. ఇక‌, ఎన్నిక‌ల కోసం సిద్దం కావాలని YCP అధినేత స్ప‌ష్టంగా నిర్ధేశించారు.
ఇక‌, ఇదే స‌మ‌యంలో త‌న పాద‌యాత్ర పై అధికార పార్టీ ఆలోచ‌న‌ల‌ను పార్టీ నేత‌ల‌తో జ‌గ‌న్ పంచుకున్నట్లు స‌మాచారం. త‌న పాద‌యాత్ర ప్రారంభం అయిన నాటి నుండి అడ్డంకులు సృష్టించేందుకు TDP అధినేత కుట్ర‌లు చేస్తార‌ని .. బ్రేకులు వేసేందుకు కుయుక్తులు ప‌న్నుతార‌ని YCP అధినేత అభిప్రాయ ప‌డ్డారు. త‌న పాద‌యాత్ర షెడ్యూల్ ప్ర‌కారం..ముందుకు వెళ్ల‌నీయ‌కుండా అడ్డుకొనేందుకు TDP స‌ర్వ శ‌క్తులు ఒడ్డుతుంద‌ని వివ‌రించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా..ప్ర‌జ‌ల మ‌ధ్య కు వెళ్ల‌టం ఖాయ‌మ‌ని..పాద‌యాత్ర ఆగే ప్ర‌స్త‌కి లేద‌ని తేల్చి చెప్పారు. తాను ఆరు నెల‌ల పా టు పాద‌యాత్ర‌లోనే ఉంటుండడంతో ముఖ్యంగా నియోజ‌క‌వ‌ర్గ MLA లు – ఇన్‌ఛార్జ్‌లు ప‌రిస్థితుల‌కు అనుగుణంగా పార్టీ గెలుపే ల‌క్ష్యంగా ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావాల‌ని సూచించారు. అదే స‌మ‌యంలో..ప్ర‌తీ నిర్ణ‌యం కోసం త‌న కోస‌మే ఎదురు చూడ‌కుండా.. ఎక్క‌డిక‌క్క‌డ పార్టీకి మేలు జ‌రుగుతుంద‌నుకుంటే ఆ నిర్ణ‌యాలు తీసుకోండంటూ పార్టీ నేత‌ల‌కు స్వేఛ్చ నిచ్చారు. త‌న పాద‌యాత్ర ప్రారంభం కాగానే..రాజ‌కీయంగా అనేక స‌మ‌స్య‌లు సృష్టించేందుకు TDP ఎదురు చూస్తుంద‌ని..అన్నింటిని ఎదుర్కొంటూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు కోసం..గోల్ స‌క్సెస్ అవ్వ‌టం కోసం అన్నింటికి సిద్దం కావాల్సిందేన‌ని అధినేత దిశా నిర్ధేశం చేసారు.