RajakeeyaaluRajakeeyaalu

Saturday, March 24, 2018

వేషాల‌తోనే స‌రిపెడ‌తారా..!

  • March 7, 2018 | UPDATED 17:42 IST Views: 308
  • Share

 

TDP MPలు ప్ల‌కార్డుల తో నిర‌స‌న‌లు చేస్తున్నారు. APకి కేంద్రం న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వంలోనే కొన‌సాగుతూ ఆందోళ‌న‌లు చేస్తున్నామ‌ని చెబుతున్నారు. మ‌ద్ద‌తు మీడియా సైతం TDP నేత‌ల ప్ల‌కార్డుల ప్ర‌ద‌ర్శ‌న‌ను భారీ నిర‌స‌న గా ప్ర‌చారం చేస్తోంది. ఇదే స‌మయంలో..TDP MP శివ ప్ర‌సాద్ వేస్తున్న విచిత్ర వేషాలు ఇప్పుడు ఢిల్లీలో హాట్ టాపిక్ గా మారాయి. MPగా శివ ప్ర‌సాద్ APకి సంబంధించిన అంశాల కోసం నిర‌స‌న‌ల్లో అనేక ర‌కాలుగా వేష ధార‌ణ‌లు చేస్తున్నారు. కానీ, లోక్‌స‌భ స‌భ్యుడిగా శివ ప్ర‌సాద్ APకి సంబంధించిన అంశాల పై ఇప్పుడు MP నేత‌లు దృష్టి సారించారు. AP ప్ర‌యోజ‌నాల పై ..APకి సంబంధించిన అంశాల పై శివ ప్ర‌సాద్ స‌భ‌లో ఏర‌కంగా స్పందించారో..లెక్క‌లు తీస్తున్నారు.

చిత్తూరు MP శివ ప్ర‌సాద్ ప్ర‌స్తుతం రెండో సారి లోక్‌స‌భ స‌భ్యుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చిత్తూరు నుండి గెలుపొందిన శివ ప్ర‌సాద్ తొలి నుండి క‌ళా కారుడు. అనేక సినిమాల్లోనూ న‌టించారు. అయితే, కొద్ది కాలం క్రితం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌ను ప‌ట్టించు కోవ‌టం లేద‌నే భావ‌న‌తో పార్టీకి దూరంగా ఉన్నారు. ఇక‌,ప్ర‌స్తుత పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల్లో కేంద్రం APకి అన్యాయం చేస్తుం దంటూ TDP నేత‌లు ఆందోళ‌న చేస్తున్నారు. ఆ స‌మ‌యంలో..ఇత‌ర MPలకు భిన్నంగా MP శివ ప్ర‌సాద్ రోజుకో విచిత్ర వేషం తో ఇత‌రుల దృష్టిని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. పార్ల‌మెంట్ సభ్యుడిగా ఉంటూ శివ‌ప్ర‌సాద్ ఈ ర‌కంగా విచిత్ర వేషాల‌తో రావటం పై ఇప్పుడు చ‌ర్చ మొద‌లైంది. ప్ర‌ధానంగా MP పార్ల‌మెంట్ స‌భ్యులు ఈ అంశం పై ప్ర‌త్యేకంగా చ‌ర్చ‌లు చేసుకుంటున్నారు. బ‌డ్జెట్ తొలి విడ‌త స‌మావేశాల్లో MP శివ‌ప్ర‌సాద్ లోక్‌స‌భ సెక్ర‌ట‌రీ టేబుల్ పై ఉన్న పుస్త‌కాల‌ను తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేయ‌గా.. స్పీక‌ర్ మంద‌లించార‌ని MP నేత‌లు గుర్తు చేస్తున్నారు. నిర‌స‌న‌లు..ఆందోళ‌న‌లు MPలుగా చేసే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ..ఈ ర‌క మైన వేషధార‌ణ ఏంట‌నేది ఇప్పుడు జ‌రుగుతున్న ప్ర‌ధాన చ‌ర్చ‌. అస‌లు..లోక్‌స‌భ స‌భ్యుడిగా శివ ప్ర‌సాద్ పెర్‌ఫార్మెన్స్ ఏంట‌నే దాని పైనా చ‌ర్చ లేవెనెత్తుతున్నారు. స‌భ జ‌రిగే స‌మ‌యంలో గ‌తంలో శివ ప్ర‌సాద్ ఏం ర‌కంగా వ్య‌వ‌హ‌రించిందీ..ఏ అంశాల‌ను ప్ర‌స్తావించిందీ లెక్క‌ల‌ను బ‌య‌ట‌కు తీస్తున్నారు.

ఎంపీగా శివ‌ప్ర‌సాద్ ఇప్ప‌టి వ‌ర‌కు 48 ప్ర‌శ్న‌ల్లో మాత్ర‌మే భాగ‌స్వామ్యం తీసుకున్నారు. అంతుకు మించి మ‌రే విధంగానూ స‌భా కార్య‌క‌లాపాల్లో ప్ర‌మేయం లేద‌నే లెక్క‌లు బ‌ట‌య‌కు వ‌స్తున్నాయి. అనుబంధ ప్ర‌శ్న‌ల ద్వారా కానీ, ప్ర‌త్యేక చ‌ర్చ‌ల అంశంలో కానీ ఏ సందర్భంలోనూ శివ ప్ర‌సాద్ జోక్యం చేసుకోలేదు. ప్ర‌స్తుతం మోదీకి వ్య‌తిరేకంగా చేస్తున్న అందోళ‌న‌ల్లో రోజుకో వేషంతో పార్ల‌మెంట్ ఎంట్రీ గేట్ వ‌ద్ద శివ ప్ర‌సాద్ హల్‌చ‌ల్ చేస్తున్నారు. ఎంపీగా ఇలా చేయ‌టం హుందాగా ఉంటుందా అనే చ‌ర్చ సైతం ఇప్పుడు జోరుగా సాగుతోంది. నాలుగేళ్ల కాలంగా APకి సంబంధించి TDP MPలు ఒక‌రిద్ద‌రు మిన‌హా మిగిలిన వారు ప్ర‌త్యేక దృష్టి పెట్టిన సంద‌ర్భాలు లేవు. ఇప్పుడు కేవ‌లం మీడియా దృష్టిని ఆక‌ర్షించ‌టం కోస‌మే ఈ ర‌కంగా పార్ల‌మెంట్ బ‌య‌ట వ్య‌వ హ‌రిస్తున్నారనేది కొంద‌రు MP నేత‌ల ఆరోప‌ణ‌. రోజు రోజుకీ MP – TDP మ‌ధ్య పెరుగుతున్న గ్యాప్ కార‌ణంగా అనేక అంశా ల‌ను తెర మీద‌కు తీసుకొస్తున్నారు. రానున్న రోజుల్లో MP నేత‌లు వీటిని బ‌హ‌రింగంగానే విమ‌ర్శించే అవ‌కాశం ఉంది. మ‌రి.. వీటికి TDP నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.