RajakeeyaaluRajakeeyaalu

Friday, February 23, 2018

KCR దెబ్బ కు TDP అబ్బా…

  • October 12, 2017 | UPDATED 16:30 IST Views: 3730
  • Share

 

తెలంగాణ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర‌రావు రాజ‌కీయ ఎత్తులు వేయ‌టంలో అందెవేసిన చెయ్యి అని మ‌రోసారి నిరూపించుకున్న‌ సంఘ‌ట‌న ఒక‌టి చోటు చేసుకుంది. అటువంటి ఎత్తులు వేయ‌గ‌లిగారు కాబ‌ట్టే తెలంగాణ‌లో ప్ర‌భుత్వాన్ని ఒంటి చేత్తో న‌డిపిస్తున్నారు.   ఇంత కాలం రాజ‌కీయాల్లో నేనే సీనియ‌ర్‌ను. 40 ఏళ్లు అనుభ‌వం ఉందని చెప్పుకున్న చంద్ర‌బాబు నాయుడు ఇప్పుడు క‌ళ్లెళ్ల బెట్టి   చూడ‌టం త‌ప్ప ఏం చేయాలో తెలియ‌టం లేదు.  ఇప్పటి వరకు  గొప్ప‌లు చెప్పుకున్న బాబు తో  స‌హా పార్టీ నేత‌ల్లో క‌ల‌క‌లం మొద‌లైంది. ఎవ‌రూ ప్ర‌శాంతంగా లేరు. అంద‌రూ ఏం జ‌రుగుతుందో తెలియ‌ని క్వశ్చ‌న్ మార్క్ ముఖాలతో ద‌ర్శ‌నమిస్తున్నారు. ఒక్క ఎత్తుతో వేరే పార్టీలో ఆ స్ధాయి అల‌జ‌డి సృష్టించ‌గ‌ల‌గ‌డం ఏమైనా సామాన్య విష‌యమా? ఓ ఐడియా జీవితాన్నే మార్చేసిన‌ట్లుగా KCR ఐడియా ఇప్పుడు TDP లో నిద్ర‌ లేకుండా చేస్తుంది. KCR  అంటే ఏమిటో రుచి చూసి ఉన్నారు. నమ్మితే  ఎలా ఉంటుంది? కాదంటే ఏం జరుగుతుందో తేల్చుకోలేక పోతున్నారు.  ఆ పరిస్థితికి KCR TDPని నెట్టారు.
తెలంగాణ CM KCR విప‌క్ష పార్టీ MLA ల‌కే కాదు. సొంత పార్టీ MLA ల‌కు అపాయింట్ ఇవ్వ‌ర‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. అంతే కాదు. న‌ల్గొండ జిల్లా జిల్లా ప‌రిష‌త్ అధ్య‌క్షుడి ఇంట్లో పెళ్లి హైద‌రాబాద్‌లో జ‌రిగితేనే ఆయ‌న హాజ‌రు కాలేదు. అటువంటి KCR ప్ర‌త్యేకంగా ప‌ని గ‌ట్టుకుని పెద్ద‌గా స్నేహం కూడా లేని ప‌రిటాల సునీత ఇంట్లో పెళ్లికి అనంత‌పురం వెళ్లాడంటే? ఏదో ఉంద‌ని ఇట్టే అర్దం అయిపోతుంది. గ‌తంలో కింజ‌ర‌పు ఎర్న‌న్నాయుడు కుమారుడు రామ్మోహ‌న్ నాయుడు పెళ్లికి పిలిస్తే కూడా ఆయ‌న వెళ్ల‌లేదు. కానీ అనంత‌పురం వెళ్లారు. ఎందుక వెళ్లారో, దాన్ని ఏ స్ధాయి రాజ‌కీయంగా మ‌లిచారో తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.
మ‌హానుభావులు ఊరకనే వ‌స్తారా?
 KCR అనంత‌పురం వెళ్లి పెళ్లికి హాజ‌ర‌య్యి వ‌చ్చేస్తే వార్త పెద్ద విశేషం ఏమీ లేదు. పెళ్లి పేరుతో వెళ్లి అక్క‌డ వేసిన ఎత్తులే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో TDP శ్రేణుల‌కు నిద్ద‌ర క‌రువు చేశాయి.  దాంట్లో ఒకటి ర‌వి స‌మాధికి నివాళి అర్పించ‌టం. రెండు ప‌య్యావుల కేశ‌వ్ ఏకాంతంగా మాట్లాడ‌టం. అదే త‌రుణంలో KCR ఫొటో ని TDP ప్లేక్సీలో ముద్రించి క‌ట్ట‌డం జ‌రిగింది. ఈ ప‌రిణామాలు ఇప్పుడు TDPలో అసాధార‌ణ‌మైన సంక్షోభాన్ని సృష్టించాయి. చంద్ర‌బాబు నాయుడు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ ఆదేశాలు పాటించే నేత‌లు చంద్ర‌బాబు నాయుడుపై తిరుగుబాటు జెండాకు సంకేతాలు ఇచ్చారు. వీళ్ల‌కు న‌చ్చ చెప్ప‌టానికి చంద్ర‌బాబు నాయుడు కొత్త డ్రామా కు తెర లేపారు. ప‌య్యావుల కేశ‌వ్ పై ఫైర్ అయిన‌ట్లుగా లీక్‌లు ఇచ్చారు. దాంతో కేశ‌వ్ మ‌రో డ్రామా మొద‌లు పెట్టారు. AP లో జ‌రుగుతున్న డ్రామాల‌ను చూసి తెలంగాణ నేత‌లు మండిప‌డుతున్నారు. విష‌యం తేల్చ‌కుండా డ్రామాలేమిటి? అని ప్ర‌శ్నిస్తున్నారు. TRS తో పొత్తు ఉంటుందా? ఉండ‌దా? ఇప్పుడే తేల్చాల‌ని వార్నింగ్‌లు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి తాజాగా చంద్ర‌బాబు ముందు ఇదే డిమాండ్ పెట్టార‌ని తెలుస్తోంది. పొత్తు ఉంటే TDP చీలిక ఖాయం అంటున్నారు. కాబ‌ట్టి చంద్ర‌బాబు నాయుడు కు KCR తో పొత్తును కాదంటే మ‌ళ్లీ “ఓటుకు నోటు” కేసు తెర‌పైకి వ‌స్తుందా? అనే భ‌యం కూడా లేక‌పోలేదంటున్నారు. పొత్తు ఉంటే తెలంగాణ TDP భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్ద‌క‌మే అని ప‌రిశీల‌కులు విశ్లేషిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు నాయుడు ఏం చేయాలో తెలియ‌క నాన్చుడు ధోర‌ణి అవ‌లంభిస్తున్నారు.
తెలంగాణ TDPలో ఆయోమ‌యం?
తెలంగాణ‌లో KCR‌పై పార్టీ నేత‌లంతా క‌లిసి ఒంటి కాలిపై లేచే ప‌రిస్థితి కాస్తా జావ‌ కారిపోతుంది. కొంద‌రు నేత‌లు ఇప్ప‌టి నుంచే జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. పొత్తు ఉంటే KCR‌తో స‌ఖ్య‌తగా ఉంటే మంచి అవ‌కాశాలు ఉంటాయ‌ని భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు చంద్ర‌బాబు. KCR‌ల‌ను ఎలా న‌మ్మాలి? అని వాళ్ల ప్ర‌య‌త్నాల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంద‌నే ప్ర‌క‌ట‌న మాదిరిగా KCR ఒక్క టూరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో TDPని క‌కావిక‌లం చేస్తోంది. ముఖ్యంగా తెలంగాణ‌లో పార్టీ రెండు వ‌ర్గాలుగా చీలిపోయింది. ఎవ‌రు ఎటువైపు ఉంటారోన‌నే అనుమానాలు క‌లుగుతున్నాయి. దీంతో పార్టీ నేత‌ల్లో అయోమ‌యం నెల‌కొంది. ఇప్పుడు తెలంగాణ TDP నేత‌ల  దృష్టి KCR పై లేదు. పార్టీలో ఉండాలా? బ‌య‌ట‌కు పోవాలా? అనే కోణంలో ఆలోచ‌న సాగుతుంది. KCR ఎత్తుతో ఓ ప్ర‌ధాన పార్టీని ప‌క్క‌దారి ప‌ట్టించారు.  ఇవ‌న్నీ తేలి మ‌ళ్లీ ఆ పార్టీ కోలుకోవాలంటే చాలా టైం ప‌డుతుందంటున్నారు.