RajakeeyaaluRajakeeyaalu

Saturday, March 24, 2018

జ‌గ‌న్‌ను ఇలా పెంచాను… విజ‌య‌మ్మ‌

  • January 29, 2018 | UPDATED 16:35 IST Views: 1120
  • Share

 

AP ప్ర‌తిప‌క్ష నేత YS జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో 1000 కిలో మీట‌ర్ల మైలు రాయిని దాడుతున్న సంద‌ర్భంగా సాక్షి TV మ‌న‌సులో మాట కార్య‌క్ర‌మంలో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు కొమ్మినేని శ్రీ‌నివాస‌రావు జ‌రిపిన ఇంట‌ర్వ్యూ వైసీపీ పార్టీలో జోష్ నింప‌ట‌మే కాకుండా జ‌గ‌న్‌పై ప్ర‌జ‌ల్లో మ‌రింత‌గా భ‌రోసా నింప‌టానికి దోహ‌దం చేసేదిగా ఉంది. సాక్షి మీడియా వాళ్లు మంచి టైంకి విజ‌య‌మ్మ‌గారి ఇంట‌ర్వ్యూ చేశార‌ని పించింది. చాలా ముఖ్య‌మైన విష‌యాల‌కు విజ‌య‌మ్మ‌గారు బాగా స‌మాధానాలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ YS కుటుంబ ప‌ట్ల వ్య‌వ‌హారించిన తీరు నుంచి గ‌త 9 ఏళ్లుగా చోటు చేసుకున్న అనేక ప‌రిణామాల‌పై చాలా సూటిగా స్ప‌ష్టంగా ఆమె త‌న మ‌నోభావాలు వ్య‌క్తం చేశారు. ఎక్క‌డ కూడా తొణ‌క‌కుండా చంద్ర‌బాబు వైఫ‌ల్యాలు ఎత్తి చూపారు. YS లాగా జ‌గ‌న్ కూడా ప‌ట్టుద‌ల మ‌నిష‌ని, ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉండాట‌ని కూడా విజ‌య‌మ్మ చెప్పారు. జ‌గ‌న్‌కు ఒక అవ‌కాశం ఇవ్వాల‌ని ఈ ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా విజ‌య‌మ్మ AP ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. కొన్నిముఖ్య‌మైన అంశాల‌ను ఇక్క‌డ ప్ర‌స్తావించుకుందాం.

 

AP ప్ర‌జ‌ల‌కు మీరు ఈ ఇంట‌ర్య్వూ ద్వారా ఏం చెప్ప‌ద‌ల్చ‌కున్నారు. జ‌గ‌న్ త‌రుపున మీరు కూడా AP ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇస్తారా? అన్న ప్ర‌జ‌ల‌కు విజ‌య‌మ్మ చాలా కాజువ‌ల్‌గా జ‌గ‌న్‌ త‌రుపున నేను మాట ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు. జ‌గ‌న్ మాట ఇస్తే మాట‌కు క‌ట్టుబ‌డి ఉండే మ‌నిషిని చెప్పారు.  గ‌త ఎన్నిక‌ల్లో రైతు రుణ మాఫీ హామీ ఇచ్చి ఉంటే అధికారంలోకి వ‌చ్చేశారు క‌దా? అంటే జ‌గ‌న్‌కు అబ‌ద్దపు హామీలు ఇవ్వ‌టం ఇష్టం ఉండ‌దు. అధికారం కోసం ఇలా మాట్లాడే త‌త్వం కాదు. జ‌గ‌న్ కు అబ‌ద్దాలు చెప్ప‌టం చేత‌కాద‌న్నారు.

TDP  అదినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు ఉంటే,తమ వద్ద ప్రజలు ఉన్నారని YS ఆర్ కాంగ్రెస్ గౌరవాద్యక్షురాలు విజయమ్మ అన్నారు. ప్రజలలో నిలబడి ఉంటే, నాయకులు వాళ్లంతట వారే వస్తారని గతంలో రాజశేఖరరెడ్డి అనేవారని, ఇప్పుడు అదే జరుగుతుందని ఆమె అన్నారు. YS 35 ఏళ్ల పాటు కాంగ్రెస్ పాటు సేవ చేస్తే వాళ్లు త‌మ కుటుంబాన్ని వేధింపుల‌కు గురి చేశార‌ని  విజ‌య‌మ్మ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కొన్ని ముఖ్య‌మైన అంశాలు

చంద్రబాబు కాకుండా జగన్‌ సీఎం కావాలని ప్రజలు ఎందుకు కోరుకోవాలనుకుంటున్నారు?

విజయమ్మ: ఎవరైనా ప్రజలకు మంచి చేయాలి. మంచి పనులు చేస్తామనే వారికి కాకుండా వేరేవాళ్లకు ప్రజలు ఎందుకు ఓటు వేస్తారు. మంచి చేస్తానంటున్న జగన్‌కే తప్పకుండా ఓటు వేస్తారు. YS‌ పాలన చూశారు కనుక జగన్‌ పాలన రావాలన్న కోరిక ప్రజల్లో నాకు కనిపిస్తోంది. చంద్రబాబు దగ్గర అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలుంటే, మా దగ్గర ప్రజలున్నారు. YS‌ ఒక మాట చెప్పేవారు. ప్రజల్లో నిలబడి ఉంటే నాయకులు వాళ్లంతట వాళ్లే వస్తారనేవారు.

జగన్‌ ఇలా రాజకీయాల్లోకి వస్తారని అనుకునేవారా?

విజయమ్మ: 2009లో ఎంపీగా నిలబడాల్సి వచ్చినప్పుడు తాను నిలబడనని జగన్‌ చెప్పాడు. చిన్నాన్నతో పోటీ చేయించండని అన్నాడు. అలా మాట్లాడొద్దు, నా 30 ఏళ్ల అనుభవం నీకు ఉపయోగపడుతుంది, ఎక్కువ మంది ప్రజలకు మంచి చేయాలంటే అధికారంలో ఉంటేనే చేయగలుగుతావు అని YS‌ చెప్పారు.

APకి ప్రత్యేక హోదా గురించి ఏమని భావిస్తున్నారు?

విజయమ్మ: విభజన వల్ల హైదరాబాద్‌ పోయింది కనుక ప్రత్యేక హోదా ఎంతో అవసరం. APలో పరిశ్రమలు లేవు, ఆసుపత్రులు లేవు. APకి హైదరాబాద్‌ లాంటి రాజధాని రావాలంటే కష్టమే. మహిళలపై జరుగుతున్న దురాగతాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే ఒకటి, రెండు స్థానాల్లో ఉంది. ఇక చంద్రబాబు ఏ వర్గానికి కూడా న్యాయం చేయడం లేదు. నాలుగేళ్లవుతోంది. చంద్రబాబు అసెంబ్లీ కట్టారా? హైకోర్టు కట్టారా? ఆయన ఎవరికి మేలు చేశారు? ఎంతమందికి మేలు చేశారు?  తన పేరు గుర్తుండిపోయేలా చంద్రబాబు ఒక్క పనైనా చేశారా? ఏదీ లేదు. ప్రజలే ఆయనకు తగిన సమాధానం చెబుతారు.

చంద్రబాబు కంటే జగన్‌ మేలు, ఆయనకు ఓటేయాలని ప్రజలకు ఎలా చెప్పగలుగుతారు?

విజయమ్మ: గతంలో YS‌ ఎంపీల మీటింగ్‌లో చంద్రబాబుకు చెప్పారు. 2000వ సంవత్సరం కంటే ముందు ప్రాజెక్టులు కట్టి ఉంటే నికర జలాలు కేటాయిస్తారు, ప్రాజెక్టులు మొదలు పెట్టు అని బాబుకు సూచించారు. దేవుడు అవకాశం ఇచ్చి 14 ఏళ్ల అధికారంలో ఉన్నా చంద్రబాబు ప్రజలకు ఏమీ చేయనప్పుడు చరిత్రలో అలాంటి వ్యక్తిని మళ్లీ ఎన్నుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా.

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు చాలా డబ్బు ఖర్చు పెడతారంటున్నారు. వాటిని ధీటుగా ఎదుర్కొనే పరిస్థితి మీ పార్టీలో ఉందా? మీ పార్టీ నడుస్తున్న తీరుపై మీరేమంటారు?

విజయమ్మ: అనుభవం కొంతమేర ఉపయోగపడవచ్చేమో గానీ నాయకుడు కావాలనుకొనే వ్యక్తికి మానవత్వం చాలా ముఖ్యం. అలా ఉన్నప్పుడే ఏమైనా చేయగలుగుతారు. అది జగన్‌లో ఉంది. చంద్రబాబులో లేదు. అనుభవం అంటున్నారు. దేనిలో చూపించారు. హైకోర్టు కట్టారా? అసెంబ్లీ కట్టారా? ఏం చేశారు?

జగన్‌ను ప్రజలకు అప్పగించానని మీరంటున్నారు. ప్రజలు ఆయనను ఎట్లా చూస్తున్నారు?

విజయమ్మ: ఓదార్పు యాత్రలో జగన్‌ను చూసేందుకు బయటకు రానివారు ఎవ్వరూ లేరు. నేను ప్రచారానికి వెళ్లినప్పుడూ అంతే. ఎంతో ప్రేమ చూపించారు. వాళ్లకు ఈ కుటుంబం ఎంత రుణపడి ఉందో వారు కూడా అదే విధంగా ప్రేమను చూపిస్తున్నారు. నా బిడ్డ అందరికీ మంచి చేస్తాడు.

 

చంద్రబాబుకు దేవుడు చాలా సమయం ఇచ్చాడు. ఇంతకు ముందు తొమ్మిదేళ్లు, ఇప్పుడు ఐదేళ్లు. చంద్రబాబు సద్వినియోగం చేసుకోవడం లేదెందుకో అర్థం కావడం లేదు. రాజశేఖరెడ్డి ఏం చేశారు, ఆయన పోయాక కూడా జనం ఎందుకు గుర్తు పెట్టుకుంటున్నారన్న ఆలోచన సైతం చంద్రబాబుకు కలగడం లేదు