RajakeeyaaluRajakeeyaalu

Saturday, March 24, 2018

ఓటు కు నోటు…రాజ్య‌స‌భ సీటు..!!

  • March 11, 2018 | UPDATED 16:34 IST Views: 2538
  • Share

 

ద‌ళిత నేత‌కు నో టిక్కెట్‌. ష‌రా మామూలే. రాజ్య‌స‌భ సీటు అయినా..MLC సీటు అయినా..ద‌ళిత నేత‌ల‌కు చివ‌రి దాకా ఆశ పెట్ట‌టం చివ‌ర్లో హ్యాండ్ ఇవ్వ‌టం ప‌రిపాటిగానే మారింది. ఎన్నిక‌ల ముందు రెండు రాజ్య‌స‌భ స్థానాల‌ను TDP ఓసిల‌కే కేటాయిం చింది. సామాజిక‌-ప్రాంతీయ స‌మీక‌రణాల‌ను చంద్ర‌బాబు ప‌క్కాగా పాటిస్తార‌ని చెప్పే TDP నేత‌లు ఇప్పుడు ఖంగు తిన్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఒక్క‌టే. ఇప్ప‌టి వ‌ర‌కు ఓటుకు నోటు కార‌ణంగానే చంద్ర‌బాబు కేంద్రానికి భ‌య ప‌డుత‌న్నార‌ని..హైద‌రాబాద్ వ‌దిలేసి వ‌చ్చేసార‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌డు..రాజ్య‌స‌భ సీటు విష‌యంలోనూ చివ‌రి వ‌ర‌కు గోప్య‌త పాటించి కొన్ని లాబీయింగ్ ల కార‌ణంగా ఎట్ట‌కేల‌కు తాను అనుకున్న విధంగా TDP లీగ‌ల్‌సెల్ నేత క‌న‌కమేడ‌ల ర‌వీంద్ర‌కుమార్ కు రాజ్య‌స‌భ సీటు.. ఇంత కీ ఎవ‌రీ ర‌వీంద్ర కుమార్..ఎందుకీ ప్రాధాన్య‌త అనుకుంటే…ఇదీ అస‌లు క‌ధ‌..

TDP లో MLC ఎన్నిక అయినా..రాజ్య‌స‌భ సీటు అయినా..ఎన్నో త‌ర్జ‌న -భ‌ర్జ‌న‌లు. ఇది సర్వ సాధార‌ణం. ఎవ‌రికి ఇవ్వాల‌నేది TDP అధినేత చంద్ర‌బాబు ముందుగానే ఫిక్స్ అయిపోతారు. కానీ, సీనియ‌ర్ల‌తో మంత‌నాలు..ఆశావాహుల‌తో చ‌ర్చ‌లు పేరుతో అనే క మీటింగ్‌లు జ‌ర‌గుతాయి. మ‌ద్ద‌తు మీడియా దీనికి విస్తృత ప్ర‌చారం క‌ల్పిస్తుంది. సామాజిక – ప్రాంతీయ స‌మీక‌ర‌ణాల‌ను దృష్టిలో ఉంచుకొని చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకుంటార‌ని TDP నేత‌లు ప‌దేప‌దే చెబుతూ ఉంటారు. TDP రాజ్య‌స‌భ స‌భ్యుల‌ అధికారిక ప్ర కట‌న వ‌చ్చే వ‌ర‌కూ సీయం ర‌మేష్‌..దళిత నేత వ‌ర్ల రామ‌య్య పేర్లు ఖ‌రారు అయిన‌ట్లు ఉద్దేశ పూర్వ‌కంగానే లీకులిచ్చారు. అభ్య‌ర్ధు ల ఎంపిక పై తొలుత పాలిట్ బ్యూరో స‌మావేశం సైతం ఏర్పాటు చేయాల‌ని భావించారు. చంద్ర‌బాబుకు అభ్య‌ర్ధులెవ‌రో ముందుగా నే ఫిక్స్ అయిపోవ‌టంతో ఆ స‌మావేశం ర‌ద్దు చేసుకున్నారు. అంతే, ఢిల్లీలో లాబీయింగ్ కోసం తొలి నుండి త‌న కోటరీలో కీల‌కం గా ఉన్న సీయం ర‌మేష్ కు తిరిగి అవ‌కాశం క‌ల్పించారు. ఒక‌టి ఓసికి ఇవ్వ‌టంతో రెండో స్థానం ఎస్సీల‌కు ఇస్తార‌ని TDP నేత‌ల‌తో పాటుగా మ‌ద్ద‌తు మీడియా ఊద‌ర గొట్టింది. కానీ, ఊహించిందే జ‌రిగింది. ఎస్సీని కాద‌ని..మ‌రో ఓసికే ఈ సారి కూడా రాజ్య‌స‌భ సీటు ఖ‌రారు చేసారు. TDP లీగ‌ల్ సెల్‌ కన్వీనర్గా ఉన్న క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్ హైకోర్టు అడ్వ‌కేట్‌. తెలుగు దేశం పార్టీకి సంబంధించిన‌..అధినేత చంద్ర‌బాబుకు సంబంధించిన న్యాయ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కోసం ప‌ని చేస్తుంటారు.

ఇక‌, ఇదే ర‌వీంద్ర కుమార్..చంద్ర‌బాబు మెడ‌కు చుట్టుకున్న ఓటు కు నోటు కేసులో వ‌కాల్తా పుచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి త‌ర‌పున కోర్టు లో వాదించి ఆయ‌న‌కు బెయిల్ ఇప్పించ‌గ‌లిగారు. ప్ర‌స్తుతం ఈ ఓటుకు నోటు కేసు స‌ర్వోన్న‌త న్యాయ స్థానం లో ఉంది. ఇక‌ రాజ్య‌స‌భ అభ్య‌ర్ధిత్వం కోసం చంద్ర‌బాబు ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌టం లో ర‌వీంద్ర‌కుమార్ స‌క్సెస్ అయ్యారు. ఢిల్లీ స్థాయిలో కీల‌క స్ధానంలో ఉంటూ చంద్ర‌బాబు కు స‌న్నిహితంగా ఉండే వ్య‌క్తుల ఒత్తిడి మేర‌కే ర‌వీంద్ర కుమార్ కు అభ్య‌ర్ధిత్వం ఖ‌రారు చేయాల్సి వ‌చ్చింద‌ని పార్టీ నేత‌లే వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులుకు గ‌వ‌ర్న‌ర్ గిరి ఇస్త‌న్నార‌ని..తాను కేంద్రానికి ప్ర‌తిపాదించాన‌ని అప్ప‌ట్లో TDP తెలంగాణ నేత‌ల వ‌ద్ద వ్యాఖ్యానించిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. ఇప్ప‌టికీ..మోత్కుప‌ల్లికి అటువం టి అవ‌కాశ‌మే రాలేదు. ఇక‌, వ‌చ్చే ఛాన్స్ లేదు. ఇక‌..వ‌ర్ల రామ‌య్య కు చివ‌రి నిమిషం వ‌ర‌కు రాజ్య‌స‌భ అభ్య‌ర్ధిత్వం ఖ‌రారు చేసి న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. ఆయ‌న కుటుంబ స‌భ్యులు ముఖ్య‌మంత్రిని క‌లిసేందుకు వ‌స్తూ..ప్ర‌కాశం బ్యారేజి నుండి వెనక్కు తిరిగి వెళ్లిపోయిన‌ట్లు మీడియా లో క‌ధ‌నాలు వ‌స్తున్నాయి. గ‌త రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లోనూ..ఇప్పుడు ఓసిల‌కే ప్రాధాన్య ఇచ్చారు. ఇక వైసిపి విష‌యానికి వ‌స్తే..పార్టీ ఏర్పాటు నుండి త‌న‌తో అన్ని క‌ష్టాల్లో క‌లిసి న‌డిచిన విజ‌య సాయిరెడ్డికి జ‌గ‌న్ గ‌తంలో అవకాశం క ల్పించారు. ఇక‌, గ‌తంలో స‌ర్దుబాటుల్లో భాగంగా..వేమిరెడ్డి ప్ర‌భాక‌ర‌రెడ్డికి అంద‌రి అమోదంతో ఈ సారి జ‌గ‌న్ రాజ్య‌స‌భ అభ్య ర్దిత్వం కు అవ‌కాశం క‌ల్పించారు. రాజ్య‌స‌భ‌కు ప‌రిశీలిస్తామ‌ని ఏ ఇత‌ర నేత‌ల‌కు జ‌గ‌న్ హామీ ఇవ్వ‌లేదు. చంద్ర‌బాబు త‌రహాలో జ‌గ‌న్ ఇత‌రులకు..ప్ర‌ధానంగా ఎస్సీ-బిసి సామాజిక వ‌ర్గాల నేత‌ల‌కు హామీ ఇస్తే ఇప్పుడు TDP అధినేత త‌ర‌హాలోనే జ‌గ‌న్ సైతం విమ‌ర్శ‌ల పాల‌య్యేవారు. ఏది ఏమైనా ఎటువంటి పోటీ లేకుండా ఏపిలో రాజ్య‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌క్రియ ఏక‌గ్రీవంగా జ‌ర‌గ‌నుంది.

క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్ గ‌తంలో రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసులో కోర్టులో ఏం వాదించారో ఆయ‌న మాట్లోనే..ఈ లింక్ ద్వారా..