RajakeeyaaluRajakeeyaalu

Saturday, March 24, 2018

YCP లో వారికి కీర్తి కిరీటం..!

  • March 10, 2018 | UPDATED 18:10 IST Views: 1067
  • Share

 

YCP కార్య‌క‌ర్త‌ల పార్టీ. సామాన్యుల పార్టీ. నేత‌ల‌కే కాదు…కార్య‌క‌ర్త‌ల‌కు కిరీటం ద‌క్కాలి. TDP మాదిరి డ‌బ్బున్న వారికే టిక్కెట్ విధానం కాకుండా క‌ష్టానికి త‌గిన ప్ర‌తిఫ‌లం పార్టీలో ద‌క్కాలి. ఇదే జ‌గ‌న్ స‌రి కొత్త ఆలోచ‌న‌. దీనికి త‌గిన విధంగానే..పార్టీలో అంకిత భావంతో ప‌ని చేస్తున్న కొంద‌రు కార్య‌క‌ర్త‌ల‌కు సీట్లు కేటాయించాల‌ని నిర్ణ‌యించారు. ఊహించ‌ని విధంగా సీట్ల కేటాయింపు పై నిర్ణ‌యం దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ఎంపిక చేసే స‌మ‌యంలో వారు పార్టీకి చేసిన సేవ‌..కార్యక‌ర్త‌ల్లోనూ- ప్ర‌జ‌ల్లోనూ ఉన్న గుర్తింపు..అధికార పార్టీని ఎదుర్కొన్న తీరు..క్లీన్ ఇమేజ్ వంటివి ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటున్నారు. పాద‌యాత్ర ముగిసేలోగా ఎవ‌రినైతే ఎంపిక చేసారో వారికి నియోజ‌క‌వ‌ర్గాల‌ను కేటాయించాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. కార్య‌క‌ర్త‌ల‌కు గుర్తింపు ఇవ్వటం ద్వారా…కేడ‌ర్ కు బ‌ల‌మైన సంకేతాలతో పార్టీకి మేలు జ‌రుగుతుంద‌ని భావిస్తున్నారు. ఈ వ్య‌వ‌హారంలో జ‌గ‌న్ ఫార్ములా ఏంటి…

YCP అధినేత జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. పార్టీలో క‌ష్ట‌ప‌డే కిందిస్థాయి కేడ‌ర్ కు గుర్తింపు ఇచ్చే దిశ‌గా ఆ నిర్ణ‌యాన్ని అతి త్వ‌ర‌లో ప్ర‌క‌టించ బోతున్నారు. ఇప్ప‌టికే ప్ర‌తీ నియోజ‌క‌ర్గం వారీగా పార్టీ బ‌లాలు – బ‌ల‌హీన‌త‌ల గురించి జ‌గ‌న్ ప్ర‌త్యేకంగా రెండు స‌ర్వే సంస్థ‌ల ద్వారా పూర్తి స‌మాచారం తెప్పించుకున్నారు. అదే విధంగా ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు..పార్టీ నేత‌ల పని తీరు ఎలా ఉంది..ప్ర‌జ‌ల‌తో ఎంత వ‌ర‌కు మ‌మేకం కాగ‌లుతున్నార‌నే విష‌యం పైనా స‌మాచారం సేక‌రిస్తున్నారు. ఇక‌, పార్టీ కార్య క్ర‌మాల నిర్వ‌హ‌ణ తీరు..ప్ర‌భుత్వం పోరాట ప‌టిమ‌..కార్య‌క‌ర్త‌ల‌తో స‌త్సంబంధాలు..బూత్ లెవ‌ల్ లో పార్టీ నిర్మాణం వంటి వాటి పై ఇందులో ప్ర‌ధానంగా ఆరా తీస్తున్నారు. ఈ నివేదిక‌ల ఆధారంగా టిక్కెట్లు ఖ‌రారు చేయ‌నున్నారు. ఇదే స‌మ‌యంలో..పార్టీ కోసం క‌ష్టప‌డే వారి గురించి సైతం జ‌గ‌న్ దృష్టి పెట్టారు. ఇప్ప‌టికే అందులో కొంద‌రిని గుర్తించిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. అటువంటి వారికి ఎన్నిక‌ల్లో టిక్కెట్లు ఇవ్వాల‌ని జ‌గ‌న్ యోచిస్తున్నారు. వారికి ఆర్దికంగా బ‌లం లేక‌పోయినా..ఆ బాద్య‌త పార్టీ తీసుకుంటుంది. వారిని ఆ దిశ‌గా స‌మాయ‌త్తం చేసేలా పార్టీ సీనియ‌ర్ల‌కు జ‌గ‌న్ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తున్నారు.

గుంటూరు జిల్లాలో పార్టీ కోసం ప‌ని చేస్తూ అనేక కేసులు ఎదుర్కొన్న రాజ‌ధాని ప్రాంతానికి చెందిన పార్టీ సీనియ‌ర్ కార్య‌క‌ర్త నందిగం సురేష్ కు బాప‌ట్ల‌ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుండి అవ‌కాశం ఇవ్వాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు.. ఆయ‌న‌కు కావాల్సిన అన్ని స‌హాయ స‌హ‌కారాల‌ను అందించాల్సిందిగా పార్టీ నేత‌ల‌కు ఇప్ప‌టికే జ‌గ‌న్ సూచించిన‌ట్లు పార్టీ నుండి అందుతున్న స‌మాచారం. ఇదే విధంగా..అనంత‌పురం జిల్లాలోనూ మ‌రో నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌భుత్వంలో అధికారిగా ప‌ని చేస్తూ మంచి ఇమేజ్ తెచ్చుకున్న అధికారి త‌లారి రంగ‌య్య కు పార్టీలో కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించారు. రంగ‌య్య ను హిందూపురం – అనంత‌పురం స‌మ‌న్వ‌య క‌ర్త‌గా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. బోయ సామాజిక వ‌ర్గానికి ఒక లోక్‌స‌భ సీటు ఇస్తాన‌ని గ‌తంలోనే ప్ర‌క‌టించిన జ‌గ‌న్ అనంత లేదా క‌ర్నూలు జిల్లాలో రంగ‌య్య‌కు అవ‌కాశం ఇచ్చే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇందు కోసం ఇప్ప‌టికే స్థానికంగా పార్టీ నేత‌ల‌తోనూ జ‌గ‌న్ సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు తెలు స్తోంది. అన్ని అనుకూలిస్తే…జ‌గ‌న్ ఆయ‌న్ను పార్టీ అభ్య‌ర్ధిగా బ‌రిలోకి దింప‌టం ఇక లాంఛ‌న‌మే.. టిడిపిలో డ‌బ్బున్న వారి కే టిక్కెట్లు ఇచ్చే ఆన‌వాయితీ ఉంది. వైసిపి లో దీనికి భిన్నంగా పార్టీ కోసం ప‌ని చేసిన‌వారికి..ప్ర‌జ‌ల్లో ఇమేజ్ ఉన్న వారిని గుర్తిం చి..వారికి అవ‌కాశం క‌ల్పించాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. దీంతో..పార్టీ కోసం ప‌ని చేసిన వారికి త‌గిన గుర్తింపు ల‌భించ‌నుంది. ఇదే జ‌రిగితే..వైసిపి లో కొత్త సాంప్ర‌దాయం ద్వారా జ‌గ‌న్ ఇమేజ్ మ‌రింత పెర‌గ‌నుంది. జ‌గ‌న్ ఎక్క‌డెక్క‌డ ఇలాంటి వారికి అవ‌కాశం క‌ల్పిస్తారో చూడాలి.