RajakeeyaaluRajakeeyaalu

Saturday, March 24, 2018

జ‌గ‌న్ సైన్యందే ఆ బాధ్య‌త‌…!!

  • March 12, 2018 | UPDATED 16:37 IST Views: 1202
  • Share

 

YCP అనూహ్యంగా..ఆక‌స్మికంగా ఏర్పాటైన పార్టీ. ఎనిమిదో ఆవిర్బావ దినోత్స‌వం. ఇద్దరితో ప్రారంభ‌మై APలో రాజ‌కీయాల‌ను శాసిస్తున్న పార్టీగా ఎదిగింది. న‌ల‌భై ఏళ్ల అనుభ‌వానికి చుక్క‌లు చూపిస్తున్న ఎనిమిదేళ్ల పార్టీ. ఎన్నో కుట్ర‌లు..మ‌రెన్నో కుతంత్రాలు.. కుమ్మ‌క్కు రాజ‌కీయాల‌ను ఎదురొడ్డి..అనేక ఆటు పోట్లు..వీట‌న్నింటినీ ఎదున్నొని రాటు తేలిన రాజ‌కీయ నేత‌గా మారారు YCP అ ధినేత జ‌గ‌న్‌. 2014 నుండి ప్ర‌తిప‌క్ష నేత‌గా జ‌గ‌న్‌..శాస‌న‌స‌భ‌లో..బ‌య‌టా త‌న సామ‌ర్ధ్యం నిరూపించుకొనే ప్ర‌య‌త్నం చేసారు. జ‌గ‌న్ ను కుట్ర‌ల‌తో జైలు పాలు చేసిన స‌మ‌యంలో..YS కుటుంబ స‌భ్యులు రోడ్డు మీద‌కు వ‌చ్చి పార్టీ కోసం శ్ర‌మించారు. జ‌గ‌న్ జైలు లో ఉన్న స‌మ‌యంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో YCP అభ్య‌ర్ధులు 18కి గాను..15 స్థానాలు గెలుచుకుంది. అటువంటి YCP 2019 ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం అవుతోంది. అన్నింటా ముందున్నట్లు క‌నిపిస్తున్న YCP లో ఇప్పుడు ఆ ఒక్క లోపం మాత్రం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. TDP త‌న వైఫ‌ల్యాల‌ను క‌ప్పి పుచ్చుకోవ‌టం కోసం YCP పై చేస్తున్న విష ప్ర‌చారాన్ని తిప్పికొట్ట‌టం లో..ఎదురు దాడి చేయ‌టంలో YCP వెనుబ‌డింది. దీనిని మార్చుకోవాల్సిన అవ‌స‌రం చాలా ఉంది.

YCP ఏర్పాటై ఎనిమిదేళ్లైంది. ఈ ఎనిమ‌దేళ్ల కాలంలో..ప్ర‌తీ అంశంలో YCP త‌న బ‌లం చాటుకుంటూనే ఉంది. జ‌గ‌న్‌-విజ‌య మ్మ ఇద్ద‌రితో ప్రారంభ‌మైన YCP ప్ర‌స్థానం.. ఆ త‌రువాత తొమ్మ‌ది మంది ఎంపీలు..67 మంది ఎమ్మెల్యేలు..ఇద్ద‌రు రాజ్య‌స‌భ స‌భ్యులు.. ఎమ్మెల్సీల స్థాయికి చేరింది. ఇప్పుడు 2019 ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం అవుతూ అధికార పార్టీకి ప‌క్క‌లో బ‌ల్లెంగా మారింది. 40 ఏళ్ల అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు ముందు YCP తేలిపోతుంద‌ని..జ‌గ‌న్ కార్న‌ర్ అవుతార‌ని TDP నేత‌లు అంచ నా వేసారు. కానీ, వారి అంచ‌నాలు త‌ప్పాయి. తొలి నుండి జ‌గ‌న్ త‌న తండ్రి వార‌స‌త్వంగా సాగిస్తున్న విశ్వ‌స‌నీయ‌త‌… తెగింపు ..ఈ రెండు జ‌గ‌న్ ను ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర చేసాయి. ప్ర‌తిప‌క్ష నేత‌గా తొలిసారి స‌భ‌లో కాలు పెట్టిన నాటి నుండి రోజు రోజుకీ ప‌రిణితి సాధించారు. ప్ర‌తీ అంశం మీదా అవ‌గాహ‌న పెంచుకున్నారు. త‌న రాజ‌కీయ జీవితంలో ఎదురైన ఆటుపోట్లు జ‌గ‌న్ ను రాజ‌కీయంగా రాటు తేల్చా యి. జ‌గ‌న్ ను జైలు పెట్టినా త‌ల్లి విజ‌య‌మ్మ‌..సోద‌రి ష‌ర్మిల పార్టీ బాధ్య‌త‌ల‌ను మోసారు. 2014 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ను ఎదుర్కోవ టం కోసం చంద్ర‌బాబు ఎక్క‌ని గ‌డ‌ప లేదు..క‌లుపుకోని నేత లేరు. ఇక‌..చంద్ర‌బాబుకు మ‌ద్దతు గా నిలిచే మీడియా సంగ‌తి స‌రే స‌రి. ఒక్క‌డి మీద దాడి చేసేందుకు ఇంత మంది క‌దిలి వ‌చ్చినా జ‌గ‌న్ వెనుక‌డుగు వేయ‌లేదు. 2014 ఎన్నిక‌ల్లో కేవ‌లం 1.95 శాతం ఓట్ల తేడాతో అధికారం కోల్పోయారు.

ఇక‌, YCP విలువ‌ల‌కు క‌ట్టుబ‌డే పార్టీ అనే పేరు ప్ర‌జ‌ల్లో పొందింది. YCP నుండి గెలిచి TDPలోకి 23 మంది ఎమ్మెల్యేలు ఫి రాయించి ఇంకా రాజీనామాలు చేయ‌కుండా మంత్రి ప‌ద‌వులు సైతం అనుభ‌విస్తున్నారు. కానీ, TDP నుండి YCPలోకి వ‌చ్చిన వారి విష‌యంలో మాత్రం జ‌గ‌న్ వారు రాజీనామాలు చేసిన త‌రువాత‌నే పార్టీలోకి ఆహ్వానించారు. ఇక‌, ప్ర‌జా స‌మ‌స్య‌లు.. AP కి ప్ర‌త్యేక హోదా వంటి రాష్ట్ర స‌మ‌స్య‌ల విష‌యంలో జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగానే కాదు..చిత్త‌శుద్దితోనూ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల్లో తెలుగుదేశం వ్యూహాల‌కు..ధీటుగానే YCP వ్యూహాల‌ను అమ‌లు చేస్తోంది. ఇక‌, తాజా రాజ‌కీయ ప‌రిణామ‌ల విష‌యంలో కి వ‌స్తే..కేంద్ర ప్ర‌భుత్వంలో నుండి TDP బ‌య‌ట‌కు వ‌చ్చింది. కానీ, ఇంకా ఎన్డీఏ లోనే కొన సాగుతోంది. ఇదే స‌మ‌యంలో..APకి ప్ర‌త్యేక హోదా కోసం కేంద్రం పై అవిశ్వాసం పెట్ట‌టానికి..రాజీనామాల‌కు సిద్ద‌మైన YCP ని ఒక ప‌ద్ద‌తి ప్ర‌కారం TDP బ‌ద్‌నాం చేస్తోంది. విజ‌య సాయిరెడ్డి ప్ర‌ధాని పై హోదా ఇస్తార‌నే విశ్వాసం ఉంద‌నే వ్యాఖ్య‌లు త‌ప్ప‌నే విధంగా TDP అధినాయ‌క‌త్వం ప్ర‌చారం చేస్తోంది. BJP తో పొత్తు పెట్టుకుంటుంద‌నే ప్ర‌చారం ద్వారా..మైనార‌టీ-ద‌ళిత ఓటు బ్యాంకు పై ప్ర‌భావం చూపించ‌టమే ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లు చేస్తోంది. AP ప్ర‌జ‌లు BJP మీద ఉన్న ఆగ్ర‌హాన్ని ప‌సిగ‌ట్టి..APకి అన్యాయం చేసిన పార్టీతో జ‌త క‌డుతోందంటూ మ‌ద్ద‌తు మీడియా ద్వారా ప్ర‌చారం చేస్తోంది. నంద్యాల ఉప ఎన్నిక స‌మ‌యంలో నూ ఇదే ర‌కంగా వ్య‌వ‌హ‌రించింది.

ఈ ప్ర‌చారాన్ని తిప్పి కొట్ట‌డంలో YCP వెనుక‌బ‌డి ఉంది. YCP -BJPతో క‌లుస్తుంద‌నే ప్ర‌చారాన్ని TDP అంత‌లా చేస్తుంటే YCP నుండి ఆశించిన స్థాయిలో స్పంద‌న లేదు. ఇప్ప‌టికీ ఎన్డీఏ కొన‌సాగుతున్న TDP మోదీ పై విశ్వాసం లేకుండానే ఆ కూట‌మిలో ఉండ‌టానికి కార‌ణ‌మేంట‌నే YCP నుండి బ‌లంగా ప్ర‌శ్నించ‌టం లేదు. మంత్రి ప‌ద‌వుల‌కు మాత్ర‌మే రాజీనామా చేసి APకి ఎంతో మేలు చేసిన విధంగా మ‌ద్ద‌తు మీడియా TDPక అనుకూలంగా ప్ర‌చారం చేస్తోంది. TDP నేత సుజ‌నా చౌద‌రి తాము 16వ లోక్‌స‌భ ముగిసే వ‌ర‌కూ ఎన్డీఏ తోనే ఉంటామ‌ని స్ప‌ష్టంగా చెప్పారు. కానీ, TDP నేత‌లు మాత్రం విజ‌య సాయి రెడ్డి ప్ర‌ధాని పై న‌మ్మ‌కం ఉందని చెప్ప‌టాన్ని త‌ప్పుగా చిత్రీక‌రిస్తూ..దుష్ప్ర‌చారం చేస్తోంది. త‌న పాద‌యాత్ర స‌భ‌ల్లో జ‌గ‌న్.. చంద్ర‌బా బు తీరును ఎండ‌గ‌డుతున్నారు. కానీ, BJP తో మైత్రి విష‌యంలో TDP పై ఎదురుదాడి చేయ‌టంలో YCP నేత‌ల్లో ఉదాసీన‌త క‌నిపిస్తోంది. ఇక‌, ప‌వ‌న్ క‌ళ్యాన్ సైతం జ‌గ‌న్ వెనుక మోదీ ఉన్నారా అనే విధంగా కామెంట్ చేసారు. దీని పైనా స్పంద‌న లేదు. ఇప్ప‌టికైనా YCP నేత‌లు ఎప్ప‌టిక‌ప్పుడు అవ‌స‌ర‌మైన విధంగా రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్ కు ధీటుగా ఎదురుదాడి చేయ‌క పోతే..జ‌గ‌న్ ఎంత క‌ష్ట‌ప‌డినా..ప్ర‌జ‌ల్లో TDP చేసే ప్ర‌చార‌మే నిజ‌మ‌ని న‌మ్మే ప‌రిస్థితి ఏర్పుడుతుంది. ఇప్ప‌టికైనా YCP నేత‌లు TDP రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తిప్పి కొట్టే విధంగా కార్యాచ‌ర‌ణ సిద్దం చేసుకోవాలి.