RajakeeyaaluRajakeeyaalu

Saturday, March 24, 2018

TDP లో ఎందుకీ అస‌హ‌నం..!

  • March 13, 2018 | UPDATED 17:09 IST Views: 1126
  • Share

 

TDP నేత‌ల్లో అస‌హ‌నం ఎందుకిలా పెరిగిపోతోంది. పార్టీ అధినాయ‌కుడి మొద‌లు మంత్రుల వ‌ర‌కు ఒకే ర‌క‌మైన వాద‌న‌. గ‌తంలో ప‌వ‌న్ కళ్యాణ్ చేసిన వాద‌న‌నే TDP నేత‌లు ఎందుకు ఇప్పుడు చేస్తున్నారు. కేంద్రం APకి స‌హ‌క‌రిచ‌టం లేద‌నే అంశం పై మాట్లాడితే ఎవ‌రికీ అభ్యంత‌రం లేదు. కానీ, 40 ఏళ్ల రాజ‌కీయ అనుభవం ఉండి.. ముఖ్య‌మంత్రిగా ఉన్న వ్య‌క్తి ద‌క్షిణం- ఉత్త‌రం అంటూ దేశం గురించి చేస్త‌న్న వ్యాఖ్య‌ల పైనే ఇప్పుడు అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి. ముఖ్య‌మంత్రి చేసిన వ్యాఖ్య‌ల పై APలోనే కాదు ఇత ర పార్టీల నేత‌లు సైతం విస్మయం వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్య‌మంత్రి వాద‌న‌ను స‌మ‌ర్ధిస్తూ మంత్రులు మ‌రో అడుగు ముందుకు వేస్తు న్నారు. APని రెండు భాగాలు చేసేందుకు BJP కుట్ర చేస్తుంద‌ని మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న‌రెడ్డి ఆరోపించారు. ప్ర‌జ‌ల్లో BJP ని డామేజ్ చేయ‌టానికి రాజ‌కీయంగా ఎటువంటి విమ‌ర్శ‌లైనా చేయ‌వ‌చ్చు..కానీ, ఇటువంటి వ్యాఖ్య‌లు స‌రైన‌వేనా అనేది ఇప్పుడు పొలిటిక‌ల్ హీట్ క్రియేట్ చేస్తోంది.

న‌ల‌భై ఏళ్ల అనుభ‌వం. దాదాపు 14 ఏళ్ల ముఖ్య‌మంత్రి గా ప‌ని చేసిన వ్య‌క్తి. ప‌దేళ్లు ప్ర‌తిప‌క్ష నేత‌గా వ్య‌వ‌హ‌రించిన వ్య‌క్తి… చంద్ర‌బాబు నాయుడు. శాస‌న‌మండ‌లి వేదిక‌గా APకి జ‌రిగిన అన్యాయం గురించి ముఖ్య‌మంత్రి వివ‌రించే ప్ర‌య‌త్నం చేసారు. అదే స‌మ‌యం లో ముఖ్య‌మంత్రి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఢిల్లీ స్థాయిలోనూ చ‌ర్చ జ‌రుగుతున్నాయి. ద‌క్షిణాది సొమ్ముల‌తో ఉత్త‌రాదికి సోకులా అంటూ ముఖ్య‌మంత్రి ప్ర‌శ్నించారు. ద‌క్షిణాది రాష్ట్రఆల సొమ్మ‌తో ఉత్త‌రాది ప్రాంతాల‌ను అభివృద్ది చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ద‌క్షిణ భార‌త దేశం నుండి కేంద్రంకు ప‌న్నుల రూపంలో డ‌బ్బులు ఎక్కువ వ‌స్తాయ‌ని.. కేంద్రం మాత్రం ఉత్త‌ర భార‌త దేశానికే ఎక్కువ‌గా ఖ‌ర్చు చేస్తుంద‌ని వ్యాఖ్యానించారు. గ‌తంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం ఇదే ర‌క‌మైన వ్యాఖ్య‌లు చేసారు. ద‌క్షిణ భారత్ దేశం పై వివ‌క్ష చూపిస్తున్నార‌ని..ద‌క్షిణ భార‌త ప్ర‌ముఖుల‌తో సమావేశం ఏర్పాటు చేస్తామ‌ని గ‌తంలో ప్ర‌క‌టించారు. ఆ త‌రువాతి కాలంలో దీని పై స్పందించలేదు. కానీ, స‌రిగ్గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏ ర‌కంగా ఉత్త‌ర‌- ద‌క్షిణ అంటూ వ్యాఖ్య‌లు చేసారో..ఇప్పుడు ము ఖ్య‌మంత్రి సైతం అదే ర‌కంగా కేంద్రం పై విమ‌ర్శ‌లు చేయ‌టానికి..ఈ ర‌క‌మైన వ్యాఖ్య‌లు చేయ‌టం పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. APకి ఉన్న స‌మ‌స్య‌లు..BJP ప్ర‌భుత్వం చేసిన మోసం గురించి ఎంతైనా మాట్లాడ‌వ‌చ్చ‌ని..కానీ, సీనియ‌ర్ రాజ‌కీయ వేత్త‌గా ఇటువంటి వ్యాఖ్య‌లు స‌రి కావ‌నే భావ‌న వ్య‌క్తం అవుతోంది.

ముఖ్య‌మంత్రి వాద‌న ఇలా ఉంటే..దీనికి కొన‌సాగింపుగా మంత్రులు మ‌రో అడుగు ముందుకేస్తున్నారు. ముఖ్య‌మంత్రి చేసిన వ్యా ఖ్యల‌ను స‌మ‌ర్ధిస్తూనే.. BJP పై సంచ‌ల‌న ఆరోప‌ణ చేసారు. APని రెండు ముక్క‌లు చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న రెడ్డి ఆరోపించారు. దీని పై BJP నేత‌లు మండి ప‌డుతున్నారు. ఇటువంటి వ్యాఖ్య‌ల ద్వారా BJP ని పూర్తిగా డామేజ్ చేసేందుకు మాత్ర‌మే కాద‌ని..ప్ర‌జ‌ల పైనా ప్ర‌భావం చూపుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. అస‌లు.. నా లుగేళ్ల పాటు కేంద్రంతో క‌లిసి ఉండి..ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌త్యేక హోదా..విభ‌జ‌న అంశాల కోసం అవ‌స‌ర‌మైన స్థాయిలో ఒత్తిడి చేయ ని TDP నేత‌లు..ఇప్పుడు పొలిటిక‌ల్ మైలేజ్ కోసం అనేక విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇటువంటి వ్యాఖ్య‌ల ద్వారా TDP నేత‌లు ఏ స్థాయిలో రాజ‌కీయ ఒత్తిడిలో ఉన్నారో.. ఎంత మేర వారిలో ప్రెస్టేష‌న్ ఉందో అర్దం అవుతుంద‌ని వైసిపి నేత‌లు వ్యాఖ్యానిస్తు న్నారు. సాధార‌ణ రాజ‌కీయ విమ‌ర్శ‌లు..APకి సాయం పై చేస్తున్న ఆరోప‌ణ‌ల కంటే భిన్నంగా..ద‌క్షిణ -ఉత్త‌ర అంటూ చేస్తున్న ఈ వ్యాఖ్య‌ల పై BJP నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.