RajakeeyaaluRajakeeyaalu

Saturday, March 24, 2018

ప‌త్రిక‌లు చెప్ప‌ని నిజాలు (02-03-2018)

  • March 2, 2018 | UPDATED 15:30 IST Views: 2284
  • Share

 

ఏపీ ప్ర‌త్యేక హోదానే TDP ని ఓడిస్తుందా?
ఏపీలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని ప్ర‌త్యేక ప‌రిస్థితి ఉంద‌ని చెప్ప‌టంలో అతిశ‌యోక్తి లేదు. ఏపీలో గ‌త ఎన్నిక‌ల ముందు నుంచే ఈ ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఆ ప‌రిస్థితి నేటికి కొన‌సాగుతుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఇదే వాతావ‌ర‌ణం ఉండే అవ‌కాశ‌లే క‌న్పిస్తున్నాయి. దీంతో  వ‌చ్చే ఏడాది ఏపీలో సాధార‌ణ ఎన్నిక‌లు రానుండ‌టంతో ఏపీలో రాజ‌కీయ పార్టీలు ఎన్నిక‌ల వేడిని రాజేస్తున్నాయి. ఏపీ సీఎం ఏపీ ప్ర‌త్యేక హోదా పై ర‌క‌ర‌కాల స్టేమ్ మెంట్స్ ఇస్తున్నారు. ఎన్నిక‌ల ముందు హోదా కావాల‌న్నారు. గెలిచిన త‌ర్వాత హోదా వ‌స్తే ఏం వ‌స్తోందన్నారు. అందుకే ప్యాకేజీ తీసుకున్నాం అంటున్నారు. ఒక‌సారి హోదా అంటూ, మ‌రోసారి ప్యాకేజీ అంటూ ప్ర‌జ‌ల్ని గంద‌ర‌గోళ ప‌రుస్తున్నారు. హోదా పై బాబు పిల్లిమొగ్గ‌లు వేస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు హోదా 15 ఏళ్లు కావాల‌న్నారు. ఆ త‌ర్వాత ప్లేట్ ఫిరాయించారు. ఇప్పుడు మ‌ళ్లీ హోదా మాకు ఎందుకు ఇవ్వ‌రంటున్న బాబు. అదే మాట మీద ఉన్నారా? అంటే అదీ క‌న్పించ‌టం లేదు. తాజాగా హోదా వ‌స్తే ఏం వ‌స్తోందో జీవో ఉందా? అని అమాయ‌కంగా ప్ర‌శ్నిస్తున్నారు. దాంతో ఇప్పుడు చంద్ర‌బాబు నాయుడు హోదాపై వేస్తున్న క‌ప్ప‌దాటు స్టెప్‌ల‌కు ప్ర‌తిఫ‌లం ఏ విధంగా ఉండ‌బోతుంద‌నే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్రంగా సాగుతుంది.
 
 ప్ర‌జ‌లు విప‌క్షాలు ఓకే మాట‌, బాట అయితే బాబుది అడ్డ‌దారి!!
  ఏపీలో ప్ర‌త్యేక హోదాను ప్ర‌జ‌లు బ‌లంగా కాంక్షిస్తున్న సంగ‌తి తెల్సిందే. టీడీపీ, బీజేపీ త‌ప్ప మిగిలిన‌వాళ్లంద‌రూ బ‌లంగా కోరుకుంటున్నారు. ప్ర‌త్యేక హోదా కోసం గ‌త నాలుగేళ్లుగా పోరాడుతున్నారు. బంద్ లు కూడా చేప‌ట్టారు. వీటి ప‌ట్ల చంద్ర‌బాబు క‌ఠిన వైఖ‌రి అవ‌లంభించారు. ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మొద‌టి నుంచి ఏపీ కి ప్ర‌త్యేక హోదా త‌ప్ప మ‌రో ప్ర‌త్యామ్నాయం లేద‌ని కుండ‌బ‌ద్దలు కొడ‌ట్ట‌మే కాకుండా హోదా కోసం ద‌శ‌ల వారిగా,అంచ‌లంచెలుగా పోరాటాలు చేప‌ట్టి నేటికి ప్ర‌త్యేక హోదా డిమాండ్‌ను స‌జీవంగా ఉంచిన ఘ‌న‌త జ‌గ‌న్ కే ద‌క్కుతుందంటున్నారు.. ఏపీ హోదా ముగిసిన అధ్య‌యం అన్న బీజేపీ,టీడీపీ నేత‌లు మాట‌ల‌ను కూడా ప‌ట్టించుకోకుండా, హోదా సాధించే వ‌ర‌కు అది ముగిసేది కాద‌ని, ఆ డిమాండ్ ఎప్ప‌టికీ స‌జీవంగానే ఉంటుంద‌ని కూడా జ‌గ‌న్ త‌న పోరాట ప‌టిమ ద్వారా చాటి చెప్పాడు. ఏపీలో ప‌చ్చ మీడియా, టీడీపీ, బీజేపీలు అన్ని ఒక్క‌టై జ‌గ‌న్ పై మూకుమ్మ‌డిగా దాడి చేసినా కూడా జ‌గ‌న్ మాత్రం మ‌డ‌మ‌తిప్ప‌లేదు. అప్పుడు  జ‌గ‌న్ తీసుకున్న ఆ నిర్ణ‌య‌మే ఇప్పుడు జ‌గ‌న్ని ప్ర‌జ‌ల్లోనూ,ఏపీలోనూ నాయ‌కుడిగా నిలిపింది. 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం ఉంద‌ని చెప్పుకుంటున్న చంద్ర‌బాబు నాయుడి కంటే జ‌గ‌న్ చాలా విష‌యాల్లో ముందు చూపుతో ఉంటాడ‌ని,ఏపీ అభివృద్ది, సంక్షేమం విష‌యంలో బాబు కంటే కూడా ఓ ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగుతున్నాడ‌ని చాటి చెప్పాడు. హోదా ను ప్ర‌జ‌లు బ‌లంగా కోరుకుంటున్నార‌ని తెలిసిన త‌ర్వాత, అలాగే వ‌చ్చే ఏడాది లో ఎన్నిక‌లు ఉండ‌టంతో చంద్ర‌బాబు నాయుడు ఇప్పుడు హోదాపై ర‌క‌ర‌కాలు స్టేట్ మెంట్స్ ఇస్తున్నారంటున్నారు. ఏపీ ప్ర‌యోజ‌నాల విష‌యంలో రాజీ ప‌డేదిలేదంటూ చంద్ర‌బాబు గంభీర‌మైన ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు.  హోదాపై స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. గ‌త నాలుగు సంవ‌త్సరాలుగా రాజ‌కీయాల కోసం హోదాను ప‌క్క‌న పెట్టిన బాబు మ‌ళ్లీ హోదాను తెర‌పైకి తెచ్చాడు. అస‌లు ఏపీ ప్ర‌యోజ‌నాలు ఫ‌ణంగా పెట్టిందెవ‌రు? ఏపీ హోదాను మోదీకి తాట్టు పెట్టిందెవ‌రు? హోదా కోసం పోరాటం చేసింది, చేస్తుందెవ‌రు?  హోదా అంటే జైలే అని బెదిరించిదెవ‌రు? అనాడు ఎందుకు అలా అన్నారు. ఈనాడు ఎందుకు మాట మార్చి మ‌ళ్లీ కుట్ర‌ల‌కు తెర తీస్తున్నార‌నేది ప‌రిశీలిద్దాం.
 బాబుకు కుడి ఎడ‌ల ఆ రెండు ప‌చ్చ ప‌త్రిక‌లు
గ‌త నాలుగేళ్లుగా వైఎస్ జ‌గ‌న్ నెత్తి నోరు మొత్తుకుంటూ ప్ర‌త్యేక హోదా కోసం ఉద్య‌మిస్తుంటే , ఆ ఉద్య‌మానికి నైతిక మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా ఉద్య‌మాన్ని అణ‌చి వేయాల‌ని చంద్ర‌బాబు నాయుడు స‌ర్కార్ కుట్ర‌లు చేసింది. హోదా అంటే జైలేన‌ని బెద‌రించింది. హోదా వ‌స్తే ఏం వ‌స్తోంద‌ని ఎదురు ప్ర‌శ్నించింది. ప‌చ్చ మీడియా కూడా వంత పాడింది. జ‌గ‌న్ ప్ర‌త్యేక హోదా ఉద్య‌మాన్ని చులకన చేసే విధంగా వ్య‌వ‌హారించింది. అదే టైంలో చంద్ర‌బాబు నాయుడు ప్యాకేజీని స్వాగ‌తిస్తే అదో ఘ‌న‌కార్యంగా కీర్తించింది.  మోదీ ప్యాకేజీ అంటే చంక‌లెగ‌రేసి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానం చేయించారు. ఇది ఏపీ ప్ర‌జ‌ల ఆత్మాభిమానాన్ని మోదీకి తాక‌ట్టు పెట్ట‌డమేన‌ని విప‌క్షాలు విమ‌ర్శించిన సంగ‌తి తెల్సిందే. ఏపీ ప్ర‌జ‌ల బాగు కోసం ప్ర‌త్యేక హోదా ఉప‌యోగ‌ప‌డుతుందని తెలిసి కూడా దాన్ని అట‌కెక్కించినందుకు అభినంద‌లు తెల‌ప‌టం అంటే అర్దం ఏమిటి? ఇది చాలాదా?  ఏపీకి హోదా రాకుండా అడ్డుప‌డిన  బాబు వెన్నుపోటు పోడిచాడ‌ని చెప్ప‌టానికి.., అని విప‌క్షాలు నిల‌దీశాయి.త‌న స్వార్దం  కోసం, ఏపీ అసెంబ్లీ సీట్ల పెంపు కోసం గ‌త నాలుగేళ్లుగా మోదీ ఏం చేసినా కుక్కిన పేనులా కిక్కురుమ‌న‌కుండా వ్య‌వ‌హరిస్తూ వ‌చ్చిన బాబు,  అసెంబ్లీ సీట్లు పెంపు లేద‌ని తేలిపోవ‌టంతో మ‌ళ్లీ నాట‌కాలు, డ్రామాలు మొద‌లు పెట్టారనే విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి.. ఏపీ ప్ర‌స్తుత ప‌రిస్థితికి మోదీ కంటే బాబే ప్ర‌ధాన ముద్దాయిగా ప్ర‌జ‌లు భావిస్తున్నారు. హోదా వ‌స్తే యువ‌త‌కు ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు మెరుగు ప‌డ‌తాయ‌ని భావిస్తుంటే బాబు మాత్రం త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు, అవ‌స‌రాల చుట్టు తిరుగుతున్నారు.
 
ప‌చ్చ మీడియా ఏపీకి చేస్తున్న ద్రోహం త‌క్కువేమి కాదు
 ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఏపీకి చేస్తున్న ద్రోహంలో ప‌చ్చ మీడియా పాత్రను మ‌ర్చిపోకూడ‌దు. దివంగ‌త నేత YSR అన్న‌ట్లుగా ఆ రెండు ప‌త్రిక‌లు బాబుకు కుడి ఎడ‌ల నిల‌బ‌డి ఏపీ ప్ర‌జ‌ల‌ను వంచిస్తున్నాయి. ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బడి,ప్ర‌భుత్వ లోపాల‌ను ఎత్తి చూపుతూ ప్ర‌జ‌ల్ని చైత‌న్య వంతం చేయాల్సిన బాధ్య‌తాయుత‌మైన ప‌త్రిక‌లు బాధ్యతారహిత్యంగా వ్య‌వ‌హారిస్తున్నాయి. చంద్ర‌బాబు నంది అంటే నంది, పంది అంటే పంది అనే మాదిరిగా పూర్తి రాజ‌కీయ కోణంలో వ్య‌వ‌హరిస్తున్నాయి. దాంతో చంద్ర‌బాబు నాయుడుకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. తానేం చేసినా మీడియా ప్ర‌జ‌ల్లో సానుకూలంగా తీసుకెళ్తుంద‌నే భావ‌నతో పాప భీతి లేకుండా బాబు వ్య‌వ‌హరిస్తున్నారు. దీనికితోడు మెరుగైన స‌మాజం కోసం  అంటూ నినాదాలు ఇచ్చే టీవీ ఛాన‌ల్ కూడా త‌న వంతు పాత్ర పోషిస్తోంది. ద‌మ్మున్న టీవీ ఛాన‌ల్ సంగ‌తైతే వేరే చెప్పేది ఏముంది. ఇప్పుడు ఏపీలో రాధాకృష్ట ప‌త్రిక ఆంధ్ర‌జ్యోతి ప్ర‌భుత్వ‌మే పాల‌న చేస్తోంది.
సాక్షి మీడియా లేకపోతే?
ఏపీలో మీడియాను తన కనుసన్నల్లో పెట్టుకుని మేనేజ్ చేస్తున్న చంద్రబాబు నాయుడుకి మింగుడు పడని పత్రిక ఏదైన ఉందంటే అది సాక్షినే. ఈ పత్రికతో పాటు ప్రజాశక్తి,విశాలాంధ్ర వంటి పత్రికలు కూడా బాబు వైఫల్యాలను ఎండగడుతున్నాయి. అయినా  ఆ పత్రికలు చాల పరిమితంగానే ప్రజల్లోకి వెళ్తున్నాయి. పార్టీ అనుబంధ సంస్ధలుగా వాటి పరిమితులు వాటికి ఉన్నాయి.
ఏపీలో  సాక్షి పత్రిక లేకపోతే ఆ మాత్రం అయినా నిజాలు ప్రజలకు తెలిసేవి కావు. ఆ రెండు పత్రికలు కూడా అప్పుడప్పుడు బాబు పాలనా వైఫల్యాలపై కథనాలు రాస్తున్నాయంటే సాక్షి పత్రిక పుణ్యమేనని అంగీకరించక తప్పదు.