October 21, 2018
info@rajakeeyaalu.com

చదివిన వారి సంఖ్య

 

సామాన్యుడి అస్త్రంపై ప్ర‌భుత్వ జులుం

Written by  May 30, 2018
  • 555 Views
తెలిసి తెలిసి నిప్పుజోలికి వెళ్ల‌కూడ‌దంటారు.కాని ఈ నిజం తెలిసి కూడా ఈ నిప్పును ప‌ట్టుకుంటామంటున్నారు పాల‌కులు. నేడు సోషల్‌ మీడియా ఇప్పుడొక సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం . క‌ళ్లముందు జరుగుతున్న అన్యాయాన్ని ఉపేక్షించక్కర్లేదు... సామాజిక, రాజకీయ అంశాలపట్ల అభిప్రా యాలను లోలోపలే అణచుకోనక్కర్లేదు... ప్ర‌భుత్వం అవలంబించే నియంతృత్వ పోకడలను భరించక్కర్లేదు... నాయకుల వాగ్దానాలను నిలదీయొచ్చు... ప్రభుత్వాల ఏక పక్ష విధానాలను తూర్పారబట్టొచ్చు... అందుకు సామాజిక మాధ్యమాలు వేదికగా నిలుస్తున్నాయి. అవి సామాన్యుల గొంతుకను ప్రతిధ్వనింపజేస్తున్నాయి. ప్రజలు నిరసన తెలిపేందుకు సోషల్‌ మీడియా ఒక వేదికౌతుంది. ఈ ద‌శ‌లో సోష‌ల్ మీడియా గొంతు నొక్కెందుకు టిడిపి స‌ర్కార్ సిద్ద‌మైంది. కొంత‌మంది త‌మ ప్ర‌భుత్వ‌నికి వ్య‌తిరేకంగా క‌ధ‌నాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని, వ్య‌క్తిగ‌త రాగ‌ద్వేషాలు రెచ్చ‌గొడుతున్నార‌న్న నెపంతో అవ‌కాశం దొరికిదంటే చాలు అక్ర‌మ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. నిజాలు బ‌య‌ట‌కు రాకుండా క‌ట్ట‌డి చేస్తున్నారు. ఇక్కడ విశేష‌మేమిటంతే అధికార టీడీపీ కి అన్ని పార్టీల‌కు మించిన విస్తృత నెట్‌వ‌ర్క్ ఉంది, ఈ సోష‌ల్ మీడియా నెట్ వ‌ర్క్ ద్వారా నే గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన విష‌యం టిడిపి పెద్ద‌లు మ‌రిచిపోయిన‌ట్లున్నారు. ఇంటిలో ఎలుక‌లు ఉన్నాయంటే ఇంటిని త‌గ‌లబెట్ట‌మ‌న్న చందనా ఒక‌రు ఇద్ద‌రు చేసిన తప్పుల‌కు ఏకంగా సోష‌ల్ మీడియాపైనే యుద్దం ప్ర‌క‌టించ‌టం దార‌ణంగా ఉంది. సోష‌ల్ మీడియాపై టిడిపి వార్ .. టిడిపి పెద్ద‌లు గ‌తం నుంచి ఒక సూక్తిని గ‌ట్టిగా పాటిస్తుంటారు. కుక్క‌ను చంపాలంటే పిచ్చిద‌నే ముద్ర‌వేయాలి. ఇదే రీతిన వ్య‌వ‌హ‌రిస్తూ సోషల్‌ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు తూట్లు పొడుస్తోంది. రాష్ట్రంలో ఎన్నో స‌మ‌స్య‌లు ఉన్నా వాటిపై ఎన్ని ఫిర్యాదులు వ‌చ్చినా ప‌ట్టించుకోని పోలీసులు వెంట‌నే రంగంలోకి దిగిపోతున్నాయి.వారిపై యుద్దం ప్ర‌క‌టిస్తున్నారు. వారి సోష‌ల్ మీడియాల‌లో పోస్ట‌లు ఆపే వ‌ర‌కు ఇబ్బందుల‌కు గురిచేస్తున్నారు. తాజాగా సోష‌ల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉన్న వ్య‌క్తుల‌పై కేసులు న‌మోదు చేసి భ‌యభాంత్రులకు గురిచేసిన ప్ర‌భుత్వం. తాజాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉంటున్న వారిపై అక్రమంగా కేసులు నమోదు చేసి వారిని భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలకు ఉపక్రమించింది. గ‌తంలో ఇదే ప‌రిస్థితి త‌లెత్తితే వైసీసీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి నేరుగా ప్ర‌భుత్వ తీరును ఎండ‌గ‌ట్టి, సోష‌ల్‌మీడియా టీమ్ అంద‌రికి అండ‌గా నిలిచిన విశ‌యం గుర్తుండే ఉంటుంది. సోష‌ల్‌మీడియా విజ‌యాలు... . దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పుకు సైతం ఎదురెళ్లి జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తేసేలా జరిగిన పోరాటానికి సామాజిక మాధ్యమం ప్రేరణగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా పోరాటానికి జనవరి 26న ‘చలో విశాఖ బీచ్‌’ ఉద్యమం సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌లోనే పురుడు పోసుకుంది. సరిహద్దుల్లో దేశానికి పహరా కాస్తున్న సైనికులకు ఎలాంటి ఆహారం అందిస్తున్నారో బీఎ్‌సఎఫ్‌ జవాను తేజ్‌ బహదూర్‌ యాదవ్‌ సోషల్‌ మీడియా పోస్ట్‌ ద్వారా ప్రపంచానికి బహిర్గతం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా, రెండా ఎన్నో పోరాటాలకు సోషల్‌మీడియా వేదికవుతోంది. సామాజిక మాధ్యమాలు సామాన్యుల అభిప్రాయాలకు అద్దం పడుతున్నాయి. బండబారిన వ్యవస్థను సైతం కదిలించేలా చేస్తున్నాయి. నిద్రాణంలో ఉన్న అధికార యంత్రాంగాన్ని ఉలికిపాటుకు గురిచేస్తున్నాయి. సోష‌ల్‌మీడియాపై కోపం ఎందుకంటే... గ‌తంలో చంద్ర‌బాబు ముద్దుల కుమారుడు , మంత్రి లోకేష్‌బాబు చేసిన కామెంట్ల‌పై సోష‌ల్ మీడియాలో వీప‌రీత‌మైన స్పంద‌న ల‌భించింది. ఆయ‌న కాలుక‌డిపితే చాలు సోష‌ల్‌మీడియాలో విస్తృతంగా క‌థ‌నాలు వ‌చ్చేవి.ఇవి టిడిపి పెద్ద‌ల‌కు మింగుడు ప‌డ‌లేదు. దీంతో సోష‌ల్ మీడియా పై యుద్దం ప్ర‌క‌టించారు. కాని ఇక్క‌డ ఒక విష‌యాన్ని గుర్తుంచుకోవాలి. లోకేప్‌పై వ‌చ్చిన కామెంట్ల క‌న్నా ప‌దింత‌లు ఎక్కువ‌గా కాంగ్రెస్ పార్టీ ప్ర‌స్తుత జాతీయ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీపై వ‌చ్చేవి. కాని వారు ఏ రోజు ఎదురుదాడికి దిగ‌లేదు స‌రిక‌దా త‌ప్పులు స‌రిచేసుకొని నేడు పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టారు. గ‌తంలో లోకేష్‌పై కామెంట్ల విష‌యంలో ప‌లువురు సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు వేధించారు. తాజా ఇటీవ‌ల చంద్ర‌బాబునాయుడు, పార్టీ పెద్ద‌లు చేస్తున్న వ్యాఖ్యాల‌పై సోష‌ల్‌మీడియాలో దూమారం చెల‌రేగుతుంది. మాట‌తూలి నాయ‌కుల ప్ర‌వ‌ర్తిస్తున్న తీరును సోష‌ల్ మీడియా ఎండ‌గ‌డుతుంది. ఇదే వారికి కంట‌గింపుగా మారింది. నిజం నిప్పులాంటిది .. నివురు గ‌ప్పి ఉంద‌ని ఆద‌మ‌రిస్తే అది దాని ప్ర‌తాపం చూప‌క త‌ప్ప‌దు...
Last modified on Thursday, 31 May 2018 07:10

Google Ad

Subscribe