October 21, 2018
info@rajakeeyaalu.com

చదివిన వారి సంఖ్య

 

Breaking News

|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|

రాజకీయాలు

వ‌ర్మ సినిమాలో బాబే అస‌లు విల‌న్‌..... !

వ‌ర్మ సినిమాలో బాబే అస‌లు విల‌న్‌..... !

Oct 20 2018 291 రాజకీయాలు Rajakeeyaalu

నిజాల‌ను స‌మాధి చేసి , అవాస్త‌వాల‌ను ప్ర‌చారం చేసుకుంటూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్న చంద్ర‌బాబుకు రానున్న రోజుల్లో పెద్ద జ‌ల‌క్ త‌గ‌ల‌నుంది. త‌న భ‌జ‌న మీడియాతో పాటు త‌న గురించి ప్ర‌చారం చేసుకోవ‌టానికి ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి బాలకృష్ణ 'ఎన్‌టిఆర్‌ కథానాయకుడు పేరుతో...

పోలవరం ముంపు భూముల్లో రిసార్టులు

Written by  Jul 09, 2018
  • 88 Views

పోలవరం ముంపు భూముల్లో రిసార్టులు

పర్యాటకుల ప్రాణాలతో చెలగాటం

సీజ్ చేసిన రిసార్టుకు మళ్లీ అనుమతులు

మంత్రి ఒత్తిడే కారణం

 

పాపికొండల పేరు వింటేనే ఓ మధురానుభూతి కలుగుతుంటుంది. గోదావరి విహారం కోసం పర్యాటకులు ఉవ్విళ్లూరుతుంటారు. అదే ప్రాంతంలో ఓ రాత్రి బస చేయడానికి మరింత ఆసక్తి చూపిస్తుంటారు. ఇందుకోసం పెద్దఎత్తున ఈ ప్రాంతంలో రిసార్టులు, కాటేజీలు నిర్మితమయ్యాయి. ఈ రిసార్టులు ముంపు ప్రాంతాల్లో ఉంటే...ఏంటి పరిస్థితి ? ఇదే జరిగింది. ముంపు భూముల్లో రిసార్టులు తెరిచేశారు టీడీపీ అనుచరులు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్నారు. గతంలో సీజ్ చేసినా సరే...తిరిగి అనుమతి తెచ్చేసుకున్నారు.

పోలవరం మండలం శివగిరిలో జూబిలీ రిసార్టును రెండేళ్ల క్రితం పర్యాటక శాఖ అధికారుల ఆధ్వర్యంలో టీడీపీకు చెందిన దుర్గా ప్రసాద్ నిర్మించాడు. సర్వే నెంబరు 2.8 (2) లో ఉన్న 12.4 ఎకరాల భూమి ఇదే గ్రామానికి చెందిన కృష్ణారెడ్డిది. పోలవరం ప్రాజెక్టు కోసం భూ సేకరణలోభాగంగా ప్రభుత్వం వీటిని స్వాధీనం చేసుకుని...భూమికి భూమి పరిహారంగా జీలుగుమిల్లిలో నిర్వాసితునికి భూములిచ్చింది. ప్రభుత్వ ఆధీనంలో వెళ్లిపోయిన ఈ భూమిపై.. మంత్రి చినరాజప్ప అండదండలున్నాయని చెప్పుకుంటున్న దుర్గాప్రసాద్ పర్యాటక శాఖ అధికార్ల ఆధ్వర్యంలో రిసార్టు ప్రారంభించాడు. అమాత్యుని అండ ఉండటంతో అధికార్లు చూసీ చూడనట్టు వదిలేశారు.

5 మంది పర్యాటకుల బలి

రిసార్టు సీజ్ చేసిన అధికారులు

ఈ ఏడాది మార్చి 31న ఛత్తీస్ గఢ్ కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రిసార్టులో బస చేశారు. గోదావరి స్నానం కోసం రిసార్టు యాజమాన్యం ఏ మాత్రం రక్షణ చర్యేల్లేకుండా ఇసుకతిన్నెల్లో వదిలేసింది. నదీ గురించి తెలియన ఆ నలుగురి స్నానానకిి దిగి ప్రవాహంలో కొట్టుకుపోయారు. మరో వ్యక్తి కూడా ఇదే పరిస్థితిలో మృతి చెందాడు. పర్యాటకుల మృతి వ్యవహారంతో రిసార్టుకు అనుమతుల్లేని వ్యవహారం కాస్తా బయటకు వచ్చింది. హడావిడగ అధికార్లు రిసార్టును సీజ్ చేశారు.

మంత్రి ఒత్తిడితో మళ్లీ అనుమతులు

రిసార్టు ప్రారంభం..

అయితే నాలుగు నెలల అనంతరం ఇప్పుడు మళ్లీ రిసార్టుకు అనుమతిలిచ్చేశారు. ఏప్రిల్ లో సీజ్ చేసినప్పుడు అనుమతుల్లేవని చెప్పిన అధికార్లు ఇప్పుడు అనుమతులు ఎలా ఇచ్చారో అర్ధం కావడం లేదు. అనుమతి కూడా నిర్వాసితుడైన కృష్ణారెడ్డి పేరిట ఇచ్చారు అధికార్లు. అనుమతికి సంబంధించిన ఆదేశాల్లోనే గతంలో సీజ్ చేసిన అంశాన్ని ఉదహరించారు కూడా. ఉపాధి పేరిట నిర్వాసితుడికి అనుమతిస్తున్నట్టు ఆదేశాల్లో ఉంది. ప్రాజెక్టుకు సంబంధించి అవసరమైనప్పుడు భూమిని తిరిగి ప్రభుత్వానికి అప్పజెప్పాలన్న షరతును విధించారు. వాస్తవానికి భూమికి భూమి పరిహారం కింద నిర్వాసితుడికి అందినప్పుడు... యాజమాన్యం హక్కులు ప్రభుత్వానికే వర్తిస్తాయి. అటువంటప్పుడు తిరిగి కృష్ణారెడ్డి పేరిట అనుమతులివ్వడంలో ఆంతర్యమేమిటి ? ముంపు భూముల్లో రిసార్టులకు అనుమతులివ్వడం ఎంతవరకూ సమంజసమని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాధీనంలో వెళ్లిపోయినా..తిరిగి ప్రైవేటు వ్యక్తుల పెత్తనమేంటని అడుగుతున్నారు. రిసార్టు యాజమాన్యం నిర్లక్ష్యంతో ఐదుమంది ప్రాణాలు కోల్పోయినా...ప్రభుత్వానికి పట్టింపులేదా...? మళ్లీ జరగరానిదేమైనా జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారన్న ప్రశ్నకు అధికార్ల నుంచి సమాధానం లేదు. అమాత్యుని ఒత్తిడి ఉంటే....నిబంధనలు గాలికి వదిలేస్తారా ? పర్యాటకుల ప్రాణాలకు విలువ లేదా ? ఇప్పటికే పాపికొండల పర్యాటకంలో ఇప్పటికే తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటూ...ప్రాణాలు పోతున్నాయి. ఇప్పుడు మరోకోణంలో ప్రయాణీకుల భద్రతను మూల్యంగా చెల్లించనున్నారా....

Last modified on Monday, 09 July 2018 10:04

Google Ad

Subscribe