October 21, 2018
info@rajakeeyaalu.com

చదివిన వారి సంఖ్య

 

Breaking News

|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|

రాజకీయాలు

వ‌ర్మ సినిమాలో బాబే అస‌లు విల‌న్‌..... !

వ‌ర్మ సినిమాలో బాబే అస‌లు విల‌న్‌..... !

Oct 20 2018 287 రాజకీయాలు Rajakeeyaalu

నిజాల‌ను స‌మాధి చేసి , అవాస్త‌వాల‌ను ప్ర‌చారం చేసుకుంటూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్న చంద్ర‌బాబుకు రానున్న రోజుల్లో పెద్ద జ‌ల‌క్ త‌గ‌ల‌నుంది. త‌న భ‌జ‌న మీడియాతో పాటు త‌న గురించి ప్ర‌చారం చేసుకోవ‌టానికి ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి బాలకృష్ణ 'ఎన్‌టిఆర్‌ కథానాయకుడు పేరుతో...

TDPకి ఆనం రాం రాం ... అదే బాటలో మరికొందరు

Written by  Jun 04, 2018
  • 680 Views

నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి రాజీనామా చేశారు. తెలుగు దేశం పార్టీ తో గత రెండేళ్ళ బంధాన్ని అయన తెంచేశారు. ఆనం కుటుంబం తెలుగుదేశం పార్టీని వీడుతుందని గత కొన్నినెలలుగా ప్రచారం జరుగుతోంది. పార్టీలో చేరినప్పటినుండి ఆనం సోదరులు అసంతృప్తిగానే ఉన్నారు. అయితే ఆనం వివేకానంద రెడ్డి అకాల మరణంతో పార్టీ మారే కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడింది. వివేకానంద రెడ్డి బ్రతికి ఉండగానే వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆనం కుటుంబం ప్రయత్నం చేసింది. కానీ పరిస్థితులు అనుకూలించక అప్పట్లో అది సాధ్యం కాలేదు.

తెలుగు దేశం పార్టీని వీడిన రామనారాయణ రెడ్డి తాను ఏపార్టీలో చేరేది ఇంకా స్పష్టం చేయలేదు. అయితే అయన వైస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ, జన సేన పార్టీలవైపు కూడా చూస్తున్నారని అయన అనుచరులు చెపుతున్నారు. త్వరలోనే అయన నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. అయితే వివేకానంద రెడ్డి లేకుండా రామనారాయణ రెడ్డి రాజకీయాల్లో గెలిచే అవకాశాలు చాలా తక్కువ. రామనారాయణ రెడ్డి రాజకీయం అంతా సోదరుడు వివేకానంద రెడ్డి కృషి, కష్టమే. ప్రజలతో గానీ, కార్యకర్తలతోగానీ రామనారాయణ రెడ్డికి నేరుగా సంబంధాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో అయన ఏపార్టీలో చేరినా ఆపార్టీకి వచ్చే అదనపు బలం పెద్దగా ఉండకపోవచ్చు. ఇక రామనారాయణ రెడ్డి బాటలోనే తెలుగు దేశంలో ఉన్న మరికొంతమంది మాజీ కాంగ్రెస్ నాయకులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ప్రకాశం జిల్లాకు చెందిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన ఆదాల ప్రభాకర్ రెడ్డి, కడప జిల్లాకు చెందిన డి ఎల్ రవీంద్ర రెడ్డి వంటి నాయకులతో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన కరణం బలరాం వంటివారు తెలుగుదేశం పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో డి ఎల్ రవీంద్ర రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నా తర్వాత చేరకుండా తటస్తంగా ఉంటున్నారు. కరణం బలరాం తెలుగు దేశం నాయకుడే అయినా ప్రస్తుతం అసంతృప్తితో ఉన్నారని, వేరే పార్టీలవైపు చూస్తున్నారని తెలుస్తోంది. మిగిలిన నాయకులు తెలుగు దేశం పార్టీలో చేరి ప్రస్తుతం నిర్లిప్తంగా ఉన్నారు.

మంత్రి భూమా అఖిలప్రియ కూడా ప్రస్తుతం తెలుగుదేశం పై అసంతృప్తితో ఉన్నారు. ఆవిడ ప్రస్తుతం జనసేన పార్టీ వైపు చూస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలు కావటంతో తమ రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా ఈ నేతలు వివిధ పార్టీల్లో చేరే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నారు. తమ భవిష్యత్తు చంద్రబాబుతో మెరుగ్గా ఉంటుందా లేదా అనే అంశాన్ని పలువురు నాయకులు తీవ్రంగా విశ్లేషిస్తున్నారు. కొందరు కార్యకర్తలతో చర్చిస్తుంటే మరికొందరు తమ అనుచరులతోనో, శ్రేయోభిలాషులతోనో చర్చిస్తున్నారు. రానున్న 2019 ఎన్నికల్లో రాజకీయ నాయకులకు మంచి ప్రత్యామ్నాయాలే కనిపిస్తున్నాయి. కొత్తగా వచ్చిన జనసేన 175 స్థానాల్లో పోటీచేయాలని నిర్ణయించడం వల్ల, అన్ని నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు బీజేపీ కూడా సిద్ధంగా ఉండడం వల్ల అనేక మంది అసంతృప్తి నేతలు ఈ రెండు పార్టీలవైపు చూస్తున్నారు. స్వయంగా ఈ రెండు పార్టీలకు రాష్ట్రంలో బలం లేకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ క్రేజ్ తో జనసేన, మోడీ - అమిత్ షా క్రేజ్ తో బీజేపీ మెరుగ్గా ఉన్నాయని ఈ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రధానంగా మాజీ కాంగ్రెస్ నాయకులు అనేకమంది ఇప్పుడు తెలుగుదేశం లో అసంతృప్తితో ఉన్నారు. చంద్రబాబు వల్ల తమకు ఆశించిన ప్రయోజనం కలగలేదని గట్టి నమ్మకంతో ఉన్నారు రానున్న రెండుమూడు నెలల్లో రాష్ట్ర రాజకీయాలు ఒక రూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొంది ఉపఎన్నికలు వస్తే రాజకీయ సమీకరణలు వేగంగా జరిగే పరిస్థితి కనిపిస్తోంది. అయితే 2014 కంటే 2019 ఎన్నికలు రాష్ట్రంలో భిన్నంగా ఉండబోతున్నాయి. కాంగ్రెస్ నుండి తెలుగుదేశం పార్టీలో చేరి 2014లో గెలిచిన నేతలు 2019లో కూడా తెలుగుదేశం పార్టీలో గెలిచే అవకాశాలు తక్కువ. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లేసిన కాంగ్రెస్ కార్యకర్తలూ, ఓటర్లు ఈసారి కూడా తెలుగుదేశం పార్టీకే ఓటేసే అవకాశం లేదు. వచ్చే ఎన్నికలకు ఇదో కీలక పరిణామం.

Last modified on Tuesday, 05 June 2018 14:18

Google Ad

Subscribe