October 21, 2018
info@rajakeeyaalu.com

చదివిన వారి సంఖ్య

 

Breaking News

|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|

రాజకీయాలు

వ‌ర్మ సినిమాలో బాబే అస‌లు విల‌న్‌..... !

వ‌ర్మ సినిమాలో బాబే అస‌లు విల‌న్‌..... !

Oct 20 2018 297 రాజకీయాలు Rajakeeyaalu

నిజాల‌ను స‌మాధి చేసి , అవాస్త‌వాల‌ను ప్ర‌చారం చేసుకుంటూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్న చంద్ర‌బాబుకు రానున్న రోజుల్లో పెద్ద జ‌ల‌క్ త‌గ‌ల‌నుంది. త‌న భ‌జ‌న మీడియాతో పాటు త‌న గురించి ప్ర‌చారం చేసుకోవ‌టానికి ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి బాలకృష్ణ 'ఎన్‌టిఆర్‌ కథానాయకుడు పేరుతో...

ఆర్భాటాల బాబు - అనవసర వ్యయాల్లో దిట్ట  

Written by  Jun 12, 2018
  • 412 Views

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గొప్ప ఈవెంట్ మేనేజర్. ఎలాంటి విషయాన్నైనా గొప్ప ఈవెంట్ గా తయారుచేయగలరు. గొప్ప ఈవెంట్ నిర్వహించగల సమర్ధుడు. అయన రాజకీయాల్లో ఉన్న కార్పొరేట్ ఈవెంట్ మేనేజర్. ఈ విషయం అయన అనేక సందర్భాల్లో నిరూపించారు. ఇప్పుడు తాజాగా పోలవరం డయాఫ్రమ్ వాల్ (పునాది గోడ) నిర్మించి దాన్ని గొప్ప ఈవెంట్ గా నిర్వహించేశారు. గొప్ప నిర్వాకంగా ప్రకటించేసుకున్నారు. ఏకంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందన్న గొప్ప భ్రాంతి ప్రజల్లో కలిగించే ప్రయత్నం చేశారు. అదీ ఈవెంట్ మానేజ్మెంట్ లో ఆయనకున్న అనుభవం, నేర్పు.

2014 జూన్ 8న తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భం నుండి ఈ నాలుగేళ్లలో అన్నీ ఈవెంట్ లే. అన్నీ ఆర్భాటపు ప్రచార ఖర్చులే. షుమారు 16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తో ప్రారంభమైన రాష్ట్రానికి అయన పెట్టే ఖర్చులు రాష్ట్ర ప్రజలపై అప్పు రూపంలో తడిసి మోపెడు అవుతున్నాయి. ప్రమాణ స్వీకారం కంటే ముందే కోట్లాది రూపాయలు ఖర్చు చేసి హైదరాబాద్ సచివాలయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన బ్లాకుల్లో మార్పులు చేయించారు. ఆయన కార్యాలయానికి కేటాయించిన లేక్ వ్యూ అతిధి గృహానికి కూడా కొన్ని కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు చేశారు. ఆ తర్వాత ఓటుకు నోటు కేసు పుణ్యమా అని అవన్నీ వదిలేసి విజయవాడ వచ్చేసి ఐదు కోట్లు పైగా ఖర్చు చేసి ఒక బస్ తయారు చేయించారు. ఆ తర్వాత మరోసారి 16 కోట్లు ఖర్చు చేసి జలవనరుల శాఖ మంత్రి కార్యాలయాన్ని తన కార్యాలయంగా మార్చుకున్నారు.

అప్పటినుండి మొదలైంది అయన ఆర్భాటపు ఖర్చుల ప్రహసనం. అమరావతి నగర భూమి పూజ పేరుతొ ఒకసారి, శంఖుస్థాపన పేరుతొ ఒకసారి, తాత్కాలిక సచివాయలం శంఖుస్థాపన ఒకసారి, సచివాలయం ప్రారంభం ఒకసారి, భూములిచ్చిన రైతులకు సత్కారాలతో మరోసారి .... ఇలా అనేక ఈవెంట్ లు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించేశారు. ఇక గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, పట్టిసీమ నీటితో జలహారతి... ఇలా ఒక్కటేమిటి ... దొరికిన ఏ ఒక్క అవకాశాన్నీ అయన వదులుకోలేదు.

పెట్టుబడుల ఆకర్షణ పేరుతో విశాఖలో మూడు సంవత్సరాల పాటు నిర్వహించిన సదస్సులు కాగితాలనుండి కార్యరూపంలోకి ఇంకా రాలేదు కానీ కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ఇక విదేశీ ప్రయాణాలు లెక్కే లేదు. డజన్ల కొద్దీ అధికారులు, మంత్రులను వెంటేసుకొని ఈ నాలుగేళ్లలో అయన అనేక దేశాలు ప్రభుత్వ ఖర్చుతో జల్సా చేశారు. రానున్న యేడాదిలో కూడా అయన అనేక విదేశీ యాత్రలు చేసే అవకాశం లేకపోలేదు.

రాష్ట్రంలో, దేశంలో ఎక్కడికి వెళ్ళినా అయన ప్రత్యేక విమానం మాత్రమే వినియోగిస్తారు. పైగా నాలుగేళ్లలో రెండుసార్లు అయన కాన్వాయ్ వాహనాలు మార్చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద చిట్టాయే తయారవుతుంది. అందుకే రాష్ట్రం ఇప్పుడు 2.25 లక్షల కోట్ల అప్పు భారం మోస్తోంది. రోజువారీ ఖర్చులకు కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి రాష్ట్రానిది.

ఇక తాజా అంశం పోలవరం ప్రాజెక్టులో అయన చేసిన అవినీతి అంతా ఇంతా కాదు. 1980లో అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య శంకుస్థాపన చేసినా 1995 నుండి 2004 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా పోలవరం కోసం ఒక్క ఇటుక కూడా అయన సమకూర్చలేదు. 2004లో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే పోలవరం ప్రతిపాదన ముందుకు కదిలింది. ప్రాజెక్టుకోసం కేంద్రం నుండి అన్ని అనుమతులూ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వమే తెచ్చింది. పైగా ప్రాజెక్టులో కీలకం అయిన కుడి, ఎడమ కాల్వలు కూడా 90 శాతం అయన హయం లోనే పూర్తయ్యాయి.

కాగా 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్ర విభజన వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బాధ్యత కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుందని విభజన చట్టంలో పేర్కొనడంతో చంద్రబాబు ద్రుష్టి ఈ ప్రాజెక్టుపై పడింది. కేంద్రం నుండి నిధుల వరద ఉంటుందనీ, అందులో భారీగా ముడుపులు ఉంటాయనీ చంద్రబాబు పసిగట్టేశారు. అందుకే ఏకంగా ప్రాజెక్టు నిర్మాణం బాధ్యతలు కూడా ఆయనే కేంద్రం నుండి తీసేసుకున్నారు. ఖర్చు చేసే ప్రతి రూపాయలో తన వాటాకోసం కాంట్రాక్టర్లను తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఒక దశలో కేంద్ర ప్రభుత్వ సూచనలకు భిన్నంగా నవయుగ సంస్థను రంగంలోకీ దింపేసి ఏకంగా వెయ్యికోట్లు పైగా అదనపు వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు అప్పగించేశారు.

ఇప్పటికే బీజేపీ నేతలు పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులపై, అందులోని అవినీతిపై విచారణ కోరుతున్నారు. ఈ ఆరోపణలు పక్కదారి పట్టించేందుకు మాత్రమే చంద్రబాబు డయాఫ్రమ్ గోడ (పునాది) నిర్మాణం అంశాన్ని పండగ చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. పునాది గోడ కట్టడం ఒక భారీ విజయం లా రాష్ట్రమంతటా ఉత్సవాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో ఏకంగా ప్రాజెక్టు పూర్తయిందని భ్రమ కల్పించే లక్ష్యంతో పోలవరం ఈవెంట్ మానేజ్మెంట్ చేస్తున్నారు. ఇదీ చంద్రబాబు గొప్పతనం.

Last modified on Tuesday, 12 June 2018 05:18

Google Ad

Subscribe