October 21, 2018
info@rajakeeyaalu.com

చదివిన వారి సంఖ్య

 

Breaking News

|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|

రాజకీయాలు

వ‌ర్మ సినిమాలో బాబే అస‌లు విల‌న్‌..... !

వ‌ర్మ సినిమాలో బాబే అస‌లు విల‌న్‌..... !

Oct 20 2018 287 రాజకీయాలు Rajakeeyaalu

నిజాల‌ను స‌మాధి చేసి , అవాస్త‌వాల‌ను ప్ర‌చారం చేసుకుంటూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్న చంద్ర‌బాబుకు రానున్న రోజుల్లో పెద్ద జ‌ల‌క్ త‌గ‌ల‌నుంది. త‌న భ‌జ‌న మీడియాతో పాటు త‌న గురించి ప్ర‌చారం చేసుకోవ‌టానికి ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి బాలకృష్ణ 'ఎన్‌టిఆర్‌ కథానాయకుడు పేరుతో...

బరి తెగింపు రాతల్లో ప‌చ్చ‌మీడియా పైత్యం

Written by  Jun 13, 2018
  • 571 Views
 
 
ఏపి సీఎం చంద్ర‌బాబు నాయుడు అవినీతి, దోపిడీ. దౌర్జ‌న్యాల ప్ర‌జ‌ల‌కు తెలియ‌కుండా ర‌క్ష‌ణ క‌వ‌చ‌లా ప‌ని చేస్తున్న ప‌చ్చ మీడియా, ఇప్పుడు బాబును ప్ర‌జ‌ల్లో వెర్రి వెంగ‌ల‌ప్ప‌ను చేసి వ‌దిలి పెడుతుంది. ప‌చ్చమీడియా వ‌ల్ల ఎంత ప్ర‌యోజ‌నం పొందుతున్నారో. ఒక్కొక్క సంద‌ర్భంలో అదే మీడియా బాబుకి ఉన్న‌ కాస్త‌ ప‌రువు తీస్తుంది. గ‌త నాలుగేళ్ల‌గా ఏపీలో చంద్ర‌బాబు నాయుడు పాల‌న‌లో జనం విసిగిపోయి. ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి బ్ర‌హ్మ‌ర‌థం పడుతున్న నేప‌థ్యంలో ఏవో త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌చురించి ప్ర‌జ‌ల అటెన్ష‌న్ను డైవ‌ర్ట్ చేసేందుకు ప‌చ్చ‌మీడియా దిగ‌జారుడు రాత‌లు రాస్తుందా? అన్న అనుమానం కూడా క‌లుగుతుంది. ప‌చ్చ మీడియా బాబుకి అంత శ‌క్తి ఉంద‌ని న‌మ్ముతున్నారో లేదో అంత శ‌క్తివంతుడు కావాల‌ని భావిస్తున్నారో తెలియ‌దు కానీ బాబు ప‌రువు మాత్రం పాతిక‌డుగుల గోతిలో క‌ప్పిట్టేస్తున్నారు. ఈ పైత్యం ప‌చ్చ మీడియాకు కొత్త వ‌చ్చింది కాదు, కానీ పిచ్చి ముదిరిపోయి ప్ర‌జ‌ల్ని భ‌య‌పెట్టే స్ధాయికి ఎగ‌బాకింది. ఇప్ప‌టికే చంద్ర‌బాబు నాయుడు. లోకేష్ నాయుడులు చేసే కామెంట్లు. సాధ్యంకాని విష‌యాలు. వా రికి సంబందంలేని విష‌యాల్లో కామెంట్స్ చేస్తూ ప‌రువు తీసుకుంటుంటే వీరికి తోడు ప‌చ్చ మీడియా విచ్చ‌ల‌విడి రాత‌ల‌తో ఉన్న కాస్త ప‌రువును కూడా తీసేస్తున్నారు.
 
అమెరికాలో ఎన్నిక‌లైతే అక్క‌డ గెలుపు ఓట‌ముల‌ను బాబు నియంత్రించ‌గ‌ల‌ర‌ని ప్ర‌చారం మొద‌లు పెడ‌తారు. క‌ర్నాక‌ట‌లో ఎన్నిక‌లు జ‌రిగితే కూడా వాటి ఫ‌లితాల‌ను బాబు కంట్రోల్ చేయ‌గ‌ల‌డ‌ని ప్ర‌చారం చేస్తారు. వీళ్ల ప్ర‌చారం ఏ స్ధాయిలో జరుగుతుందంటే ప్ర‌పంచ‌లో ఏ సంఘ‌ట‌న జ‌రిగినా కూడా అదే మా బాబు వ‌ల్లే జ‌రుగుతుంద‌ని చెప్పి నిసిగ్గుగా రాత‌లు రాసే స్ధాయికి చేరిపోయింది.దానికి తాజా ఉదాహ‌ర‌ణే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ల భేటీపై ప‌చ్చ మీడియా వార్త‌. ఆ వార్త చూస్తే న‌వ్వురాకుండా ఉండ‌దు. చంద్ర‌బాబుకి ఉన్న బ‌ల‌హీన‌త‌ల్లో మీడియాలో ప్ర‌చారం పొందాల‌నే తాప‌త్ర‌యం ఒక‌టి. దాంతో ప్ర‌పంచంలో ఏ సంఘ‌ట‌న జ‌రిగినా దానికి ఏదో విధ‌మైన లింగ్ పెట్టి ఏదో ఒక కామెంటో. ప్ర‌క‌ట‌నో చేయ‌టం. దాన్ని ప‌చ్చ‌మీడియా తాటికాయ‌లంత అక్ష‌రాల‌తో మొద‌టి పేజీఓ ముద్రించి జ‌నంపైకి వ‌దిలేయంటం ప‌రిపాటిగా మారిపోయింది. కొన్ని సంద‌ర్భాల్లో బాబే స్వ‌యం చేసిన కామెంట్స్‌తో ఆయ‌న ఇర‌కాటంలో ప‌డుతున్నారు. ప్ర‌త్య‌ర్దులు ఆయ‌న‌పై జోక్‌లు పేల్చుకునే వార‌కు దారి తీస్తున్నాయి. ఇటీవ‌ల అమ‌రావ‌తిలో ఎండ‌లు తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో ఉష్టోగ్ర‌త‌లు త‌గ్గించాల‌ని అధికారుల‌ను చంద్ర‌బాబు నాయుడు ఆదేశాలు జారీ చేశార‌నే వార్త ఆ కోవ‌లోకే చెందుతుంది. నిజానిన‌కి వాతావ‌ర‌ణ స‌మ‌తుల్య‌త‌ను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా ప్ర‌ణాళిక బ‌ద్దంగా వ్య‌వ‌హారించ‌టం వే రు. ఏదైన స‌మ‌స్య రాగానేఏదో ఒక ప్ర‌క‌ట‌న చేయ‌టం వేరే బాబు ఆలోచ‌న‌. ఆచ‌ర‌ణ అంత ప‌రిశీలిస్తే ఏ రోజు వ్య‌వ‌హారం ఆ రోజులాగా క‌న్పిస్తుంది. అంతే కాకుండా ఇటీవ‌ల చంద్ర‌బాబు నాయుడు చేసిన కామెంట్స్‌పై అనేక జోక్‌లు సోష‌య‌ల్‌మీడియాలో మ‌నం చూస్తూనే ఉన్నాం. బాబు వ్య‌వ‌హారం ఇలా ఉంటే ప‌చ్చ మీడియా ప‌రిస్థితి మరీ దారుణం.
 
సింగ‌పూర్ లోఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ల భేటీ జ‌రిగిన విష‌యం తెల్సిందే. దాని నేప‌థ్యం ప్ర‌పంచ ప్ర‌జ‌లంద‌రికి తెల్సిందే. కానీ దాన్ని ప‌చ్చ మీడియా చంద్ర‌బాబు కు అంట‌గ‌ట్టారు. బాబే వారిద్ద‌రి మ‌ధ్య ఏర్పాటు చేసిన‌ట్లుగా వెబ్ సైట్‌లో ఓ క‌ల్పిత వంట‌కాన్ని వంటి వార్చారు. మొద‌టి నుంచి ఉత్త‌ర‌కొరియా సాయంగా ఉన్న ర‌ష్యా. చైనాలు ఈ భేటీకి ప్ర‌త్యేక‌మైన కృషి చేశారు. ఇటువంటి ప‌రిణామాల‌ను బాబుకు అంట‌గ‌డితే చ‌దువుకున్నోళ్లు ఏమ‌నుకుంటార‌నే క‌నీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప‌చ్చ మీడియా అతి ప్ర‌భు భ‌క్తి చాటుకుంటూ బాబు ప్ర‌జ‌ల్లో వెర్రి వెంగ‌ల‌ప్ప‌ను చేస్తుంది. ఇది కొత్త కాదు కానీ మ‌రీ బ‌రతెగింపు మాత్రం ప‌నికి రాద‌ని ప‌రిశీల‌క‌లు అంటున్నారు. వీళ్ల బుద్ది స‌క్ర‌మార్గంలో ఎప్పుడు ప‌డాలి? చ‌ంద్ర‌బాబు నాయుడు మాట‌లు. కామెంట్స్‌ను ప‌రిశీలిస్తున్న వారు ఇప్ప‌టికే బాబు నుమ‌రో గ‌జ‌ని అని ముందుగా పిలుచుకుంటున్నారు. దానికి తోడు లేని శ‌క్తిసామ‌ర్ద్యాల‌ను బాబుకు అంట‌గ‌ట్టి బాబుని ఏదో చేసేద్దాం అనుకుంటే ప‌చ్చ మీడియానే బాబు పాలిట బ‌లిపీఠంగా మారినా ఆశ్య‌ర్య ప‌డాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.
 
 
Last modified on Wednesday, 13 June 2018 12:47

Google Ad

Subscribe