October 21, 2018
info@rajakeeyaalu.com

చదివిన వారి సంఖ్య

 

Breaking News

|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|

రాజకీయాలు

వ‌ర్మ సినిమాలో బాబే అస‌లు విల‌న్‌..... !

వ‌ర్మ సినిమాలో బాబే అస‌లు విల‌న్‌..... !

Oct 20 2018 293 రాజకీయాలు Rajakeeyaalu

నిజాల‌ను స‌మాధి చేసి , అవాస్త‌వాల‌ను ప్ర‌చారం చేసుకుంటూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్న చంద్ర‌బాబుకు రానున్న రోజుల్లో పెద్ద జ‌ల‌క్ త‌గ‌ల‌నుంది. త‌న భ‌జ‌న మీడియాతో పాటు త‌న గురించి ప్ర‌చారం చేసుకోవ‌టానికి ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి బాలకృష్ణ 'ఎన్‌టిఆర్‌ కథానాయకుడు పేరుతో...

ఉండేదెవ‌రు..ఊడేదెవ‌రు..!!

Written by  Jul 07, 2018
  • 303 Views

 

ఏపిలో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌. ఉండేదెవ‌రు. ఊడేదెవ‌రు. ఇప్పుడు ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో ఇదే హాట్ టాపిక్. ఇద్ద‌రికి అవ‌కాశం క ల్పించ‌టంతో పాటుగా ఇద్ద‌రికి ఉద్వాస‌న త‌ప్ప‌దనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కొంద‌రు మంత్రుల శాఖ‌ల మార్పులు అనివార్యంగా మారింది. అయితే, ఎన్నిక‌ల ఏడాది కావ‌టం..ఇప్ప‌టికే టిడిపి నుండి కొంద‌రు నేత‌లు వైసిపి వైపు చూస్తుం డ‌టంతో అస‌లు ముఖ్య‌మంత్రి క్యాబినెట్ విస్త‌ర‌ణ‌కు సాహ‌సిస్తారా లేదా అనే సందేహం కూడా వ్య‌క్తం అవుతోంది. అయి తే, కీల‌క‌మైన ముస్లిం మైనార్టీ- గిరిజన వ‌ర్గాల‌కు క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం లేక‌పోవ‌టంతో క్యాబినెట్ విస్త‌ర‌ణ త‌ప్ప‌దని టిడిపి వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ నెలాఖ‌రులోగా విస్త‌ర‌ణ ఉంటుంద‌ని స‌మాచారం.

ఏపి రాష్ట్ర ప్ర‌భుత్వంలో మ‌రోసారి క్యాబినెట్ విస్త‌ర‌ణ పై చ‌ర్చ ప్రారంభ‌మైంది. బిజెపి కి చెందిన ఇద్ద‌రు మంత్రులు మాణి క్యాల‌రావు, కామినేని శ్రీనివాస్ త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌టంతో రెండు క్యాబినెట్ ప‌ద‌వులు ఖాళీగా ఉన్నాయి. వీరి స్థానంలో ఇద్ద‌రికి అవ‌కాశం ఇస్తార‌ని స‌మ‌చారం. ప్ర‌స్తుత క్యాబినెట్‌లో ముస్లిం- మైనార్టీ తో పాటుగా గిరిజ‌న వ‌ర్గానికి చెంది న వారికి ప్రాతినిధ్యం లేదు. దీంతో..ముస్లిం వ‌ర్గానికి చెందిన ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ష‌రీఫ్ పేరు ప్ర ముఖంగా వినిపిస్తోంది. వైసిపి నుండి ఫిరాయించి టిడిపి లోకి చేరిన ఇద్ద‌రు పేర్లు రేసులో ఉన్న‌ప్ప‌టికీ..గ‌వ‌ర్న‌ర్ వైసిపి నుండి వ‌చ్చిన వారితో ప్ర‌మాణ స్వీకారానికి సుముఖంగా లేర‌ని టిడిపి అధినేతే స్వ‌యంగా చెబుతున్నారు. దీంతో..ఇక టిడిపికి చెందిన వారికే క్యాబినెట్‌లో అవ‌కాశం ద‌క్క‌నుంది. దీంతో..టిడిపి నుండి గెలిచిన ఏకైక గిరిజ‌న ఎమ్మెల్యే ముడి యం శ్రీనివాస‌రావు పేరు తెర పైకి వ‌చ్చింది. అయ‌న‌దీ ప‌శ్చిమ గోదావ‌రి జిల్లానే. ఇప్ప‌టికే అదే జిల్లా నుండి ఇద్ద‌రు మం త్రులు క్యాబినెట్‌లో ఉన్నారు. మ‌రో ఇద్ద‌రికి ఇవ్వాల్సి వ‌స్తే అదీ అదే జిల్లా నుండి ఇస్తే..న‌లుగ‌రు మంత్రులు ఒకే జిల్లా నుండి ప్రాతినిధ్యం వ‌హిస్తారు. ఇకే జిల్లాకు ప్రాధాన్య‌త ఇస్తే స‌మీక‌ర‌ణాలు దెబ్బ తింటాయ‌ని..దీంతో..విజ‌య‌న‌గ‌రం కు చెందిన గిరిజ‌న ఎమ్మెల్సీ గుమ్మ‌డి సంధ్యారాణి పేరు పై నా చ‌ర్చ జ‌రుగుతోంది. ఇక‌,ఇప్ప‌టికే క్యాబినెట్ లో ఉంటూ ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే కార‌ణంగా ఇద్ద‌రి మంత్రుల‌ను త‌ప్పించే ఆలోచ‌న చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఉత్త‌రాంధ్ర‌కు చెందిన ఒక మంత్రిని క్యాబినెట్ నుండి త‌ప్పిస్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. అయ‌న గ‌తంలో జ‌రిగిన క్యాబినెట్ స‌మావేశాల‌కు గైర్హాజ‌రు కావ‌టం..ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉంటూ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండ‌టం వంటి కార‌ణంగా ఆయ‌న్ను త‌ప్పిస్తార‌నే వాద‌న వినిపిస్తోంది. రాయ‌ల‌సీమ జిల్లాల‌కు చెందిన మ‌రో మంత్రి ని సైతం తొలి గిస్తార‌నే వాద‌న తెర మీద‌కు వ‌చ్చింది. మంత్రి ప‌ద‌వి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి అటు పార్టీ వ్య‌వ‌హారాల్లో కానీ..ఇటు ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లో సైతం ఆ మంత్రి యాక్టివ్ గా పాల్గొన‌టం లేదు. దీంతో..ఆ మంత్రిని సైతం త‌ప్పించి అదే జిల్లాకు చెందిన మ‌రొక‌రికి అవ‌కాశం ఇస్తార‌ని చెబుతున్నారు. ఇక‌, ఎన్నిక‌ల ఏడాది కావ‌టంతో కీల‌క శాఖల ప‌ని తీరు పై ముఖ్య‌మంత్రి అసంతృప్తితో ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీని కార‌ణంగా..కొంద‌రి శాఖ‌ల మార్పు త‌ప్ప‌ద‌నే సంకేతా ల‌ను ఇప్ప‌టికే ఇస్తున్నారు. అదే విధంగా..కీల‌క‌మైన వైద్య‌- ఆరోగ్య శాఖ‌ను స్పీక‌ర్ ఇస్తార‌ని..ద‌ళిత లేదా కాపు వ‌ర్గానికి స్పీక‌ర్ పీఠం అప్ప‌గిస్తార‌నే స‌మీక‌ర‌ణాలు తెర మీద‌కు వ‌చ్చాయి. అయితే, గ‌తంలో జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ సంద ర్భంగా చెల‌రేగిన అసంతృప్తుల‌ను సైతం ముఖ్య‌మంత్రి ప‌రిగ‌ణ‌లోకి తీసుకొనే అవ‌కాశం ఉంది. వీట‌న్నింటినీ ప‌రిగ‌ణ లోకి తీసుకొని..సామాజిక‌- ప్రాంతీయ స‌మీక‌ర‌ణాల‌ను బేరీజు వేసుకుంటూ క్యాబినెట్ విస్త‌ర‌ణ చేప‌ట్టే అవ‌కాశాలు క‌నిపి స్తున్నాయి.

Google Ad

Subscribe