October 21, 2018
info@rajakeeyaalu.com

చదివిన వారి సంఖ్య

 

Breaking News

|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|

రాజకీయాలు

వ‌ర్మ సినిమాలో బాబే అస‌లు విల‌న్‌..... !

వ‌ర్మ సినిమాలో బాబే అస‌లు విల‌న్‌..... !

Oct 20 2018 287 రాజకీయాలు Rajakeeyaalu

నిజాల‌ను స‌మాధి చేసి , అవాస్త‌వాల‌ను ప్ర‌చారం చేసుకుంటూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్న చంద్ర‌బాబుకు రానున్న రోజుల్లో పెద్ద జ‌ల‌క్ త‌గ‌ల‌నుంది. త‌న భ‌జ‌న మీడియాతో పాటు త‌న గురించి ప్ర‌చారం చేసుకోవ‌టానికి ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి బాలకృష్ణ 'ఎన్‌టిఆర్‌ కథానాయకుడు పేరుతో...

TDP లో చిన‌బాబు చిచ్చు....

Written by  Jul 10, 2018
  • 209 Views

టిడిపిలో చిన‌బాబు చిచ్చు రగిల్చారా. తండ్రి కంటే ముందుగానే అభ్య‌ర్ధుల ఖ‌రారు మొద‌లుపెట్టేసారా. త‌న‌కంటూ పార్టీలో ఒక వ‌ర్గాన్ని ఏర్పాటు చేసుకోవ‌టం కోస‌మేనా ఈ ఆరాటం. ఇది..టిడిపిని ఎటువైపు తీసుకెళ్తోంది. క‌ర్నూలు టిడిపిలో ర‌గ‌డ‌. త‌న‌యుడు తెచ్చి పెట్టిన స‌మ‌స్య ఇప్పుడు చంద్ర‌బాబు మెడ‌కు చుట్టుకుంటోంది. చిన‌బాబు చేసిన ప్ర‌క‌ట‌న‌తో అసంతృప్తిలో టిజి వెంక‌టేష్. లోకేష్ చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌కారం వారి ద్ద‌రికీ టిక్కెట్లు ద‌క్కుతాయా. వారికే టిక్కెట్లు అయితే, అక్క‌డ టిడిపి పరిస్థితి ఏంటి. ఇప్ప‌టికే ఆరు గ్రూపులు..ప‌ది పంచా యితీలు అన్న‌ట్లుగా మారిన క‌ర్నూ లు టిడిపిలో ఏం జ‌రిగే అవ‌కాశం ఉంది. ఈ ప‌రిస్థితి వైసిపికి అనుకూలంగా మారుతోం దా. లోకేష్ ప్ర‌క‌టించిన అభ్య‌ర్ధుల పై స్పంద‌న ఏంటి. టిజి వెంక‌టేష్ పార్టీ మారుతారా. ఇంత‌కీ క‌ర్నూలు టిడిపిలో ఏం జ‌రుగుతోంది..


టిడిపిలో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చిన‌బాబు త‌న‌కూ స‌ర్వాధికారాలు ఉన్నాయ‌నే త‌ర‌హాలో నిర్ణ యాలు తీసుకుంటున్నారు. త‌న‌కు తానుగా అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. లోకేష్ ను సీయం చేయాల‌ని ఇంటి పోరు న‌డుస్తోంద‌నే ప్ర‌చారం పార్టీలో వినిపిస్తోంది. ఇదే స‌మ‌యంలో క‌ర్నూలు లో అభ్యర్ధుల ప్ర‌క‌ట‌న.. పార్టీలో సొంతంగా నిర్ణ‌యాలు తీసుకుంటాన‌నే విధంగా హెచ్చిరిక గా కనిపిస్తోంది. ఇక‌, తెలుగు యువ‌త అధ్య‌క్ష ప‌ద‌వికి పోరు.. కొన్ని ప్రాంతాల్లో త‌న వారికి పార్టీలో ప్రాధాన్యత వంటి నిర్ణ‌యాల‌తో ఇప్ప‌టికే చిన‌బాబు కొత్త స‌మ‌స్య‌లు తెచ్చి పెడుతున్నారు. క‌ర్నూలు ఎంపీ అభ్య‌ర్దిగా బుట్టా రేణు..క‌ర్నూలు ఎమ్మెల్యే అభ్య‌ర్దిగా ఎస్వీ మోహ‌న‌రెడ్డి బరిలోకి దిగుతార‌ని..వారిని టిడిపి అభ్య‌ర్ధులుగా భారీ మెజార్టీతో గెలిపించాల‌ని మంత్రి లోకేష్ చేసిన ప్ర‌క‌ట‌న ఇప్పుడు క‌ర్నూలు టిడిపిలో క‌ల‌క‌లం రేపుతోం ది. క‌ర్నూలు జిల్లాలో తొలి నుండి టిడిపి లో గ్రూపులు ఉన్నాయి. కెఇ ప్ర‌భాక‌ర్ టిడిపిలోనే ఉన్నా..అధినేత పై అంత‌గా న‌మ్మ‌కం లేని వ్య‌క్తిగా ప్ర‌చారం ఉంది. ఇక‌, కెఇ కుటుంబానికి భూమా కుటుంబం మ‌ధ్య పొస‌గ‌దు. ఇక‌, క‌ర్నూలు లో టిజి వెంక‌టేష్ త‌న కుమారుడు భ‌ర‌త్ కు ఈ సారి సీటు ఖాయ‌మ‌నే అభిప్రాయం తో ఇప్ప‌టికే అక్క‌డ సేవా కార్య‌క్ర‌మాల పేరు తో ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇటువంటి ప‌రిస్థితుల్లో మంత్రి లోకేష్ ఇద్ద‌రు అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించే సారు. ఇక‌, క‌ర్నూలు ఎమ్మెల్యే స్థానంలో టిజి వెంక‌టేష్ కు ప‌ట్టు ఉంది. క‌ర్నూలు ప‌ట్ట‌ణంతో పాటుగా, డోన్ ప‌రిధిలోకి వ‌చ్చే వార్డుల్లో టిజి వెంక‌టేష్ లేదా ఆయ‌న కుటుంబ స‌భ్యులు పోటి చేస్తే మ‌ద్ద‌తు ఇస్తామ‌ని స్థానికులు చెప్పే ప‌రిస్థితి. ఇప్పుడు, ఎస్వీ మోహ‌న్‌రెడ్డికి లోకేష్ సీటు ప్ర‌క‌టించారు. మోహ‌న్‌రెడ్డి వైసిపి నుండి పోటీ చేసి పార్టీ ఫిరాయించి టిడిపిలో కొన‌సాగుతున్నారు. ఆయ‌న పై స్థానికంగా వ్య‌తిరేక‌త ఉంది. ఇక‌, క‌ర్నూలు ఎంపీ అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టించిన బుట్టా రేణుక ప‌రి స్థితి అంతే. ఎమ్మిగ‌నూరులోనే ప్ర‌స్తుతం బుట్టాకు అస‌మ్మ‌తి క‌నిపిస్తోంది.

 


లోకేష్ చేసిన ప్ర‌క‌ట‌న‌తో రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న టిజి వెంక‌టేష్ అసంతృప్తి తో ఉన్నారు, ఎలాగైనా త‌న కుమారు డి కి సీటు ఇప్పించుకోవాల‌నే ల‌క్ష్యంతో ఉన్న ఆయ‌న ముఖ్య‌మంత్రి సింగ‌పూర్ నుండి రాగానే క‌ల‌వాల‌నే యోచ‌న‌లో ఉన్నారు. లోకేష్ ప్ర‌క‌ట‌న త‌రువాత జ‌రిగిన టూర్‌లోనే టిజి వ‌ర్గం అసంతృప్తితోనే క‌నిపించింది. ఇక‌, టిడిపిలో జ‌రుగు తున్న ప‌రిణామాల‌ను వైసిపి ఆస‌క్తిగా గ‌మ‌నిస్తోంది. ఇప్ప‌టికే క‌ర్నూలు అసెంబ్లీ ప‌రిధి లో హ‌ఫీజ్ ఖాన్ వైసిపి కోసం ప‌ని చేస్తున్నారు. క‌ర్నూలు లో ఉన్న మైనార్టీ కుటుంబాల్లో హ‌ఫీజ్ ఖాన్ కుటుంబానికి మంచి పేరు ఉంది. ఈ సారి ఆయ‌న‌కే వైసిపి నుండి టిక్కెట్ వ‌స్తే గెలుపు ఖాయ‌మ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. క‌ర్నూలు జిల్లాలోని రెండు లోక్‌స‌భ స్థానాల్లో ఒక‌టి బిసిల‌కు కేటాయిస్తాన‌ని వైసిపి అధినేత జ‌గ‌న్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఇక‌, టిడిపి అభ్య‌ర్ధిగా లోకేష్ ప్ర‌క‌టించిన బుట్టా రేణుక కు స్థానికంగా టిడిపి నేత‌ల నుండి స‌హ‌కారం అంద‌టం క‌ష్టంగానే క‌నిపిస్తోంది. ముఖ్యంగా టిజి వ‌ర్గంతో పాటుగా కెఇ వ‌ర్గం కూడా స‌హ‌క‌రించే ప‌రిస్థితి లేదు. ఇక‌, ఎస్వీ మోహ‌న్ రెడ్డికి కెఇ ప్ర‌భాక‌ర్ తో పాటుగా ఆయ‌న వ‌ర్గీయులు సైతం స‌హ‌క‌రించ‌టం అనుమాన‌మే. దీంతో..ఇప్పుడు లోకేష్ చేసిన ప్ర‌క‌ట‌న పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్ట‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని టిడిపి నేత‌లే వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రి, లోకేష్ త‌మ అభ్య‌ర్ధిత్వాన్ని ఖ‌రారు చేసార‌నే ఆనందంలో ఉన్న ఎస్వీ మోహ‌న రెడ్డి..బుట్టా రేణుక లు చివ‌రి వ‌ర‌కు టిడిపి అధి కారిక అభ్య‌ర్ధులుగా ఎంత వ‌ర‌కు ఉంటారు..క‌ర్నూలు టిడిపిలో ఈ ప‌రిణామం ఎటువైపు టర్న్ అవుతుందో చూడాలి.

Google Ad

Subscribe