October 21, 2018
info@rajakeeyaalu.com

చదివిన వారి సంఖ్య

 

Breaking News

|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|

రాజకీయాలు

వ‌ర్మ సినిమాలో బాబే అస‌లు విల‌న్‌..... !

వ‌ర్మ సినిమాలో బాబే అస‌లు విల‌న్‌..... !

Oct 20 2018 297 రాజకీయాలు Rajakeeyaalu

నిజాల‌ను స‌మాధి చేసి , అవాస్త‌వాల‌ను ప్ర‌చారం చేసుకుంటూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్న చంద్ర‌బాబుకు రానున్న రోజుల్లో పెద్ద జ‌ల‌క్ త‌గ‌ల‌నుంది. త‌న భ‌జ‌న మీడియాతో పాటు త‌న గురించి ప్ర‌చారం చేసుకోవ‌టానికి ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి బాలకృష్ణ 'ఎన్‌టిఆర్‌ కథానాయకుడు పేరుతో...

కాపు వర్సెస్ కాపు / ఇదే బాబు స్కెచ్

Written by  Jul 10, 2018
  • 228 Views

కాపు వర్సెస్ కాపు / ఇదే బాబు స్కెచ్

                                                                  

మొన్న రాజప్ప...నేడు గంటా                                                                                                   

కాపుల్ని కరివేపాకుల్లా తీసిపారేస్తుంటారు కాపు నేత ముద్రగడ తరచూ చెప్పేమాట ఇది. అవును నిజమే చంద్రబాబు ఇప్పుడదే చేస్తున్నారు. వాడుకున్నంత కాలం వాడుకుని ఆ తరువాత వదిలేస్తారు. ఎలాగో తెలుసా...

తను గానీ తన వర్గం గానీ సేఫ్ గా ఉంటుంది. ఆ వర్గం కొట్టుకు ఛస్తుంది. కులాల మధ్య చిచ్చు రేపడమే కాదు...ఒకే కులంలోనూ ఘర్షణ రేపుతారు. ఇదే జరిగింది. జరుగుతూ వస్తోంది. ఓ కాపు నేతని మరో కాపు నేతతో తిట్టించడం వెన్నతో పెట్టిన విద్య బాబుకి.

2014 ఎన్నికల్లో ఆ సామాజికవర్గంపై కన్నేసి....పవన్ కళ్యాణ్ ను ముగ్గులోకి దింపారు. మాయమాటలో...మరొకటో గానీ పవన్ చొక్కా చింపేసుకున్నారు. బాబుకే మద్దతంటూ ఊరూరా తిరిగారు. అటు రిజర్వేషన్లు కల్పిస్తామంటూ ఎన్నికల హామీ ఇచ్చారు. లేనిపోని ఆశలు కల్పించారు. రెండేళ్లైనా ఊసెత్తకపోవడంతో ఉద్యమం ప్రారంభమైంది. అటు కాపులకు రిజర్వేషన్ లేదు..ఇటు చొక్కా చింపేసుకున్న పవన్ ను పట్టించుకోలేదు. మొన్న రాజప్ప వర్సెస్ ముద్రగడ బొండా ఉమ వర్సెస్ ముద్రగడ కాపు ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా సంచలమైంది. రెండు దఫాలుగా దీక్ష చేసిన ముద్రగడ తునిలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఎవరు ప్రేరేపించారో తెలియదు కానీ..ఉద్యమం దారి తప్పింది. రత్నాచల్ రైలు, పోలీస్ స్టేషన్లు దగ్దమయ్యాయి. అక్కడ్నించీ కాపులే టార్గెట్ గా ఏరి ఏరి కేసులు పెట్టడం మొదలైంది. సంబంధం లేని వ్యక్తుల్ని కూడా...ఆ సామాజికవర్గంలో చురుగ్గా ఉంటే చాలు కేసు నమోదవ్వాల్సిందే. అక్కడితే ఆగలేదు వ్యవహారం. కాపు ఉద్యమ నేత ముద్రగడ టార్గెట్ గా చేసుకున్నారు బాబు. తన వర్గాన్ని ఎక్కడా కదపలేదు. అదే సామాజికవర్గంలోని నేతల్ని ఎంచుకున్నారు. ఒకరు హోంమంత్రి చినరాజప్ప మరొకరు ఎమ్మెల్యే బొండా ఉమ. ఇద్దరినీ రంగంలో దింపడంతో.. బాస్ చెప్పిందే తడవుగా ముద్రగడపై తిట్ల వర్షం కురిపించారు.

                                                            

కాపు జాతి కోసం నీవేం చేశావు..ఎందుకు చేశావో మాకు తెలుసు..రెచ్చగొట్టి తునిలో విధ్వంసానికి కారణమయ్యావు..గరిటె కంచాలతో చప్పుడు చేస్తే రిజర్వేషన్లు వస్తాయా...గతంలో బాబుతో లబ్ది పొందలేదా...డబ్బులు తీసుకోలేదా అంటూ వ్యక్తిగతంగా దూషణలు చేశారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

ఎన్నికల హామీని అమలు చేయమని అడిగి..న్యాయపరమైన కోర్కె కోసం దీక్షకు దిగితే ముద్రగడను ఎంత అవమానించాలో అంత అవమానించింది ప్రభుత్వం. కోనసీమలోని యవతపై లెక్కలేనన్ని కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ ఆ ఇద్దరికీ ఏ మాత్రం పట్టలేదు. అన్యాయంగా నమోదవుతున్న కేసుల గురించి ప్రశ్నించలేదు. తమ తమ నియోజకవర్గాల్లో సైతం యువత కేసుల్లో ఇరుక్కున్నారు. అయినా చట్టం గురించి మాట్లాడి లౌక్యంగా తప్పించుకున్నారు. తమ సామాజికవర్గంలో తిరిగి ఎలా తలెత్తుకుని తిరుగుతామని కనీసం ఆలోచించలేదంటే బాబు స్కెచ్ ప్రభావం ఎలా పనిచేసిందో అర్ధం చేసుకోవచ్చు.

ఇప్పుడు గంటా వర్సెస్ పవన్ కళ్యాణ్

                                                                     

ఇక ఎన్నికల వేళ ఎవరి మద్దతుతో అయితే అధికారం చేజిక్కించుకున్నారో వాళ్లని అర్ధంతరంగా వదిలేయడం. బాబుకు మద్దతిచ్చిన పవన్ తో వ్యవహారం మొన్నటి వరకూ బాగానే సాగింది. జనసేన పార్టీని స్థాపించినా పార్టీ పరిష్టత కంటే...మిత్రత్వానికే ఎక్కువ ప్రాధాన్యత అన్నట్టుగా సాగింది పవన్ శైలి. ఒక్కసారిగా చంద్రబాబు ప్రభుత్వంపై...లోకేష్ పై విమర్శలు చేయడం ప్రారంభించారు పవన్ కళ్యాణ్. గుంటూరు సభ వేదికగా ఇరువురి మధ్య వైరం రగిలింది. ఉత్తరాంధ్ర పోరాట యాత్రలో చంద్రబాబు ప్రభుత్వంపై పవన్ విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రభుత్వ అవినీతిని ఎండగట్టడం...ప్రశ్నించడం మొదలవడంతో మళ్లీ బాబు స్కెచ్ అమల్లోకి వచ్చేసింది. మంత్రి గంటాను టార్గెట్ చేసిన పవన్ పై...అతన్నే ఉసిగొల్పారు బాబు. పదిరోజులుగా తనపై విమర్శలు సంధిస్తున్నా.. నోరు మెదపని మంత్రి గంటా ఇవాళ హఠాత్తుగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ...పవన్ ను తిట్టడం ఇందుకు ఉదాహరణే మరి.

గంటా అన్నదేంటి...

పవన్ కు పార్టీ అధ్యక్ఢుడికి ఉండాల్సిన లక్షణాలు లేవు...గాలి మాటలు కాకుండా వాస్తవాలు మాట్లాడాలి..అవిశ్వాసం పెడితే దేశమంతా తిరిగి మద్దతు కూడగడతానని చెప్పి పత్తా లేకుండా పోయాడు. రాష్ట్ర్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రంపై మాట్లాడే దమ్ము ధైర్యం పవన్ కు లేదు..పవన్ మద్దతివ్వడం వల్లనే తెలుగుదేశం గెలిచిందని చెప్పుకోవడం హాస్యాస్పదం... పవన్ మితిమీరి అవాకులు చవాకులు పేలుతున్నారు...ఇలా పవన్ పై ఆరోపణలు సంధించారు మంత్రి గంటా.

ఇదంతా ఎందుకు జరుగుతుంది. ఆ సామాజిక వర్గాన్ని వాడుకుని...తిరిగి అదే సామాజికవర్గంతో తిట్టించడం వెనుక బాబు స్కెచ్ ఏంటి ? ఆ నేతలకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేయాలనా...? కాపు సామాజికవర్గంలో ప్రాబల్యమున్న తోట త్రిమూర్తులు వంటి నేతలను ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కాపు ఓటింగ్ అధికంగా ఉన్న మండపేట, రాజానగరం వంటి నియోజకవర్గాల్లో కమ్మ సామాజికవర్గానికే ఎందుకు టికెట్ ఇస్తున్నారు ? ఎన్నికల్లో ఇచ్చిన హామీ కోసం రోడ్డెక్కిన కాపులపై కేసులెందుకు ? దీని వెనుక మర్మమేంటి...ఆ సామాజికవర్గాన్ని చీల్చి ప్రయోజనం పొందడానికా...?ఇప్పటికైనా ఈ సామాజికవర్గం జరుగుతున్న పరిణామాల్ని విశ్లేషణ చేసుకుంటే మంచిది. లేదంటే బాబు స్కెచ్ ఇంకా అధ పాతాళానికి తొక్కేసినా ఆశ్చర్యం లేదు.

వాస్తవానికి 2014 ఎన్నికలకు ముందు వరకూ కాపు సామాజికవర్గం టీడీపీ వెంట పెద్దగా లేరనే చెప్పాలి. కాపుల్లో అధికశాతం కాంగ్రెస్ పక్షాన నిలిచేవారు. తెలుగుదేశంకు బీసీలు వెంట నిలిచేవారు. నెమ్మదిగా బీసీల్లో మార్పు రావడం ఇతర పార్టీలవైపు మళ్లడంతో...బాబు దృష్టి కాపులపై పడింది. ఎన్నికల మేనిఫెస్టో లో రిజర్వేషన్ హామీ ద్వారా కొంతవరకూ ఆకట్టుకోగా...పవన్ ను రంగంలో దింపి మరింతగా ఆకర్షించడంలో సఫళీకృతులయ్యారు. ఉభయగోదావరి జిల్లాల్లో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కాపు ఓటింగ్ గణనీయంగా ఉంటుంది. ఈ ఓటింగ్ గంప కింత గుత్తలా ఒకే పార్టీకి పడకుండా ఆపగలిగిలితే చాలు...విజయం సునాయసమైపోతుంది. ఇది జరగాలంటే సామాజికవర్గంలో చీలిక రావాలి. మాయమాటలు చెప్పి ఏదీ చేయకుండానో ఏదో చేస్తున్నట్టు భ్రమింపచేయడంలో బాబు ఎలాగూ సిద్ధహస్తుడే. ప్రచారం కల్పించడానికి నిజమని నమ్మించే ప్రయత్నం చేయడానికి ఎల్లా మీడియా ఎలానూ ఉంది. ఇలా చేస్తూనే తనతో ఉన్న ఆ సామాజికవర్గ నేతలను....అదే సామాజికవర్గ నేతలపై ఉసిగొల్పడం. ఏడాదిన్నరగా ఇదే జరుగుతోంది. లేకపోతే మొన్న ముద్రగడను...ఇవాళ పవన్ ను విమర్శించడానికీ....కేవలం హోంమంత్రి రాజప్ప...ఎమ్మెల్యే బొండా ఉమ....మంత్రి గంటా వంటి నేతలే ఎందుకు మీడియాకు ఎక్కుతున్నారు..?టీడీపీలో చక్రం తిప్పుతున్న ఆ సామాజికవర్గపు మంత్రి దేవినేని వంటివారు ఇటువంటి వ్యవహారాల్లో ఎందుకు న్యూట్రల్ గా ఉంటున్నారు...ఈ వ్యవహారం వెనుక మర్మాన్ని ఆ నేతలైతే అర్ధం చేసుకున్నారు...మరి కాపులు ఎప్పుడు అర్ధం చేసుకుంటారో అన్నదే ప్రశ్న... 

Last modified on Tuesday, 10 July 2018 14:55

Google Ad

Subscribe